లైఫ్ లో స్నేహితులు ఉంటే చాలా బాగుంటుంది. కానీ కొంతమంది స్నేహితులు మాత్రం లైఫ్ లో ఉంటే ప్రమాదమే. ఇలాంటి వాళ్ళతో అసలు స్నేహం చేయకూడదు. వీళ్ళు శత్రువుల కంటే తక్కువేమీ కాదు. ఎప్పుడూ కూడా స్వార్థంతో ఉండే వాళ్లతో స్నేహం చేయకూడదు. అలాంటి వాళ్ళతో స్నేహం చేయడం కంటే, శత్రువుతో స్నేహం చేయడం మంచిది. అలాగే, కొంతమంది ఎప్పుడూ కూడా అసూయతో ఉంటారు. అసూయ ఉన్న వాళ్ళకి దూరంగా ఉండాలి.
అలాంటి వాళ్ళు ఏమీ తట్టుకోలేరు. గట్టిగా మీరు ఏదైనా సాధించిన వాళ్లు కుళ్ళిపోతారు. అలాంటి వాళ్ళతో అసలు స్నేహం చేయొద్దు. అలాగే నెగిటివ్ గా ఆలోచించే వ్యక్తులు మన పక్కన ఉంటే చాలా ప్రమాదం. మంచిగా, పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళతో స్నేహం చేయడం వలన మనం కూడా బాగుంటాం. అదే నెగిటివ్ గా ఆలోచిస్తున్నట్లయితే మనం కూడా అలాగే మారిపోతూ ఉంటాం. కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి.
కొంతమంది అబద్ధాలు చెప్పి అందరికీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో కూడా స్నేహం చేయకూడదు. అలాంటి వాళ్ళ వలన మనం కూడా రేపు ప్రమాదంలో పడొచ్చు. మోసం చేసే వ్యక్తితో కూడా స్నేహం చేయకూడదు. మోసం చేసే వాళ్ళతో స్నేహం చేయడం వలన ఓ రోజు మనం కూడా మోసపోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉంటేనే మంచిది.