Wealth : ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షం కలగాలని అనుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, రకరకాల ఇంటి చిట్కాలు ని కూడా పాటిస్తూ ఉంటారు. పండితులు చెప్పే విషయాలను కూడా పాటిస్తూ ఉంటారు. అయితే, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి..?, ఎటువంటి విషయాలని మనం పాటించాలి వంటి విషయాలను చూద్దాం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా చేస్తే, కచ్చితంగా ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే, సంతోషంగా ఉండవచ్చు.
చాలామంది, త్వరగా భోజనాలు చేసేసి నిద్రపోతూ ఉంటారు. కొంతమంది మాత్రం, ఆలస్యంగా తింటుంటారు. అర్ధరాత్రి కూడా అయిపోతుంది. నిద్రపోయే సమయం తెల్లవారుజామున అవుతుంది. అయితే, వంట గదిలో ఖాళీ పాత్రలని అసలు ఉంచకూడదు. రాత్రిపూట వండిన పాత్రలను, తిన్న పాత్రలని శుభ్రం చేయకుండా కిచెన్ లో అలా వదిలేయకూడదు. అలా చేస్తే దరిద్రం పట్టుకుంటుందని పండితులు అంటున్నారు. ఈ పొరపాటు జరగకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది.
రాత్రి భోజనం చేసిన తర్వాత, పాత్రలన్నిటిని వెంటనే శుభ్రం చేసుకోవాలి. అలానే ఆహారాన్ని తినేటప్పుడు కూడా పూర్తిగా కాళీ చెయ్యకూడదు. రాత్రి పూట పితృదేవతలు సంచరిస్తూ ఉంటారు. మన ఇంటికి వచ్చినప్పుడు కనీసం తినడానికి ఇంట్లో అన్నం ఉందా అని చూస్తారట. అలా చూసినప్పుడు తినడానికి ఏమీ లేకపోతే, ఆకలితో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. ఒకవేళ అన్నం ఉంటే, అన్నం కి లోటు లేకుండా ఉండాలని దీవిస్తారు. కాబట్టి, పూర్తిగా పాతలను శుభ్రం చేయకుండా కొంచెం మిగిల్చి ఉంచాలి. అన్నం ని గిన్నెలో ఉంచి, మూత పెట్టి మిగిలిన పాత్రలు అన్నిటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన, లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. లక్ష్మీదేవి రావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో ఆనందం ఉంటుంది.