Foot : ఎవరైనా ఒక వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం టీ తాగినంత సులభం మాత్రం కాదు. ఎందుకంటే అతడు లేదా ఆమెలో ఎన్నో కోణాలు ఉంటాయి. అయితే ఇందుకు ఓ కిటుకు ఉంది. ఎవరు ఎటువంటి వారు తెలుసుకోవాలంటే సింపుల్‌గా వారి పాదాలు చూడండి చాలు ఇట్టే వారి గురించి తెలిసిపోతుంది. అది ఎలా తెలుస్తుందంటే.. పాదాలు ఒక్కో ఆకృతిలో ఉన్నవారి మనస్తత్వం ఒక్కో విధంగా ఉంటుంది. దాని గురించి కింద ఇవ్వడం జరిగింది.
పాదాల కింద డార్క్ ఏరియాలు ఉంటే వారు డిప్రెషన్‌లో ఉన్నారని అర్థం. డిప్రెషన్ అనేది వ్యక్తి యొక్క బరువు మొత్తాన్ని పాదాలపై పడేలా చేస్తుంది. దీంతోనే పాదాల్లో కొన్ని ప్రదేశాల్లో డార్క్ ఏరియాలు కనిపిస్తాయి. కాలి 2వ, 3వ వేలి మధ్య సందు పెద్దగా ఉంటే వారు తమ భావాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. కాలి చిటికెన వేలుపై ఆనెలాగా వస్తే ఆ వ్యక్తికి బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని అర్థం. మడమల కన్నా పాదాలు తెల్లగా పాలిపోయి ఉంటే రక్త సరఫరా పాదాల్లో సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి. కాలి బొటన వేలి కన్నా 2వ వేలు పెద్దగా ఉంటే వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారని తెలుస్తుంది.
కాలి వేళ్లు చిన్నగా ఉంటే చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుందని తెలుసుకోవాలి. పాదాలు పెద్దగా, వెడల్పుగా ఉంటే వారు ఎక్కువగా కష్టపడతారని అర్థం. పాదం ఆర్క్ లాగా ఎక్కువ ఎత్తుగా వంకరగా ఉంటే వారికి ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. వీరికి ప్రతిభా పాటవాలు ఎక్కువగా ఉంటాయి. పాదం ఆర్క్ తక్కువ ఎత్తులో, సమతలంగా ఉంటే వారు ఇతరులతో ఉండడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారని తెలుసుకోవాలి. ఇలా పాదాలను చూసి ఎవరు ఎలాంటి వారో సులభంగా చెప్పేయవచ్చు.