lifestyle

ఈ 8 అల‌వాట్ల ద్వారా ఎవ‌రైనా మంచి పేరు ప్ర‌ఖ్యాతులు, విజ‌యం సాధించ‌వ‌చ్చు..!

ఏ వ్య‌క్తి అయినా త‌న జీవితంలో త‌గిన గుర్తింపును సాధిస్తేనే న‌లుగురిలోనూ అత‌నికి విలువ ఉంటుంది. స‌మాజంలో పేరు ప్ర‌ఖ్యాతులు ఉంటేనే ఎవ‌రినైనా గొప్ప‌గా గుర్తిస్తారు. అయితే మ‌రి… అలా పేరు ప్ర‌ఖ్యాతులు సాధించాలంటే అంత మామూలు విష‌యం కాదు క‌దా. అందుకు ఎంత‌గానో శ్ర‌మించాల్సి ఉంటుంది. అయితే ఆ శ్ర‌మ‌కు తోడు ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఈ 8 అల‌వాట్ల‌ను కూడా పాటిస్తే దాంతో ఎవ‌రికైనా త్వ‌ర‌గా పేరు ప్ర‌ఖ్యాతులు ల‌భిస్తాయట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. మ‌రి ఎవ‌రైనా పాటించాల్సిన ఆ 8 అల‌వాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. ఎవ‌రైనా ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్తున్న‌ప్పుడు ఆ ఇంట్లో ఉన్న పెద్ద‌ల ఆశీర్వాదం పొందాలి. దీంతో వారి దీవెన‌లు నిండుగా ల‌భిస్తాయి. అవి ఆ వ్య‌క్తి విజ‌యానికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. అలా ఈ అలవాటు ఏ వ్య‌క్తి జీవితంలో అయినా ముఖ్య పాత్ర పోషిస్తుంది.

హిందూ పురాణాలు స్త్రీని ఆదిశ‌క్తితో పోల్చి చెప్పాయి. క‌నుక ఏ పురుషుడైనా స్త్రీని గౌర‌వించాలి. అలా గౌర‌విస్తే ఆ శ‌క్తిలో ఉన్న ప‌వ‌ర్ అత‌నికి ల‌భిస్తుంది. ఆ ప‌వ‌ర్ అత‌ని విజ‌యానికి దోహ‌దం చేస్తుంది. ఏ వ్యక్తి అయినా ఇత‌రుల‌ను చూసి ఈర్ష్య‌, అసూయ‌, ద్వేషాల‌కు లోను కాకుడ‌దు. అమిత‌మైన ఆశ క‌లిగి ఉండ‌రాదు. దీంతోపాటు త‌న‌కు క‌లిగినంత‌లో పేద‌ల‌కు స‌హాయం చేసేలా ద‌యా గుణం క‌లిగి ఉండాలి. ఇవి ఏ వ్య‌క్తినైనా ఉన్న‌త స్థానంలో నిల‌బెడ‌తాయి. కాకులు, పావురాళ్లు, ఆవులు, కుక్కల‌కు ఆహారం పెట్టాలి. ఇది అంద‌రూ అల‌వాటుగా మార్చుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఏ వ్య‌క్తికైనా శుభం క‌లిగి విజ‌యం సాధిస్తారు. ఎవ‌రైనా నిద్ర లేవ‌గానే వెంట‌నే అర‌చేతుల‌ను ప‌క్క ప‌క్క‌నే పెట్టి వాటి మ‌ధ్య లైన్లు క‌లిసే విధంగా చేతుల‌ను ఉంచి వాటిని చూడాలి. అప్పుడు ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల శుభం క‌లిగి విజ‌యం సాధిస్తారు.

follow these 8 habits for success in life

ఇంటి మీద ఉన్న క‌ప్పును శుభ్రంగా ఉంచుకోవాలి. దానిపై ఏది ప‌డితే అది వేయ‌కూడ‌దు. పైక‌ప్పు శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లోకి పాజిటివ్ శ‌క్తి ప్ర‌స‌రించి దాంతో అందులో ఉన్న‌వారికి మంచి జ‌రుగుతుంది. వారు విజ‌యం సాధించి, పేరు ప్ర‌ఖ్యాతులు పొందుతారు. ప్ర‌తి శ‌నివారం ఓ కొబ్బ‌రికాయ‌ను ఎర్ర‌ని వ‌స్త్రంలో చుట్టి అనంత‌రం 7 సార్లు మ‌నస్సులో ఏదైనా కోరిక కోరుకోవాలి. అనంత‌రం ఆ కొబ్బ‌రికాయ‌ను అలాగే పారుతున్న నీటిలో వేయాలి. దీంతో అనుకున్న‌ది నెర‌వేరుతుంది. ఏదైనా కొత్త ప‌ని ప్రారంభిస్తున్న‌ప్పుడు నీలి, న‌లుపు రంగు దుస్తులు ధ‌రించ‌రాదు. ఎరుపు, ఆకుప‌చ్చ‌, ప‌సుపు రంగు దుస్తులు ధ‌రించాలి. దీంతో అంతా శుభ‌మే క‌లిగి అన్నింటా విజ‌యం సాధిస్తారు.

Admin

Recent Posts