lifestyle

జాబ్ ఇంట‌ర్వ్యూకు వెళ్తున్నారా.. ఈ 8 టిప్స్ పాటిస్తే ఉద్యోగం మీదే..!

జాబ్ కోసం అప్లై చేసే వారు ఎవ‌రైనా స‌రే.. ఇంట‌ర్వ్యూకు వెళ్లాల్సి వ‌స్తుందంటేనే.. ఇబ్బందిగా ఫీల‌వుతుంటారు. అబ్బా.. ఇంట‌ర్వ్యూను అటెండ్ చేయాలా.. అని దిగులు ప‌డిపోతుంటారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి లెండి. అది వేరే విష‌యం. అయితే సాధార‌ణంగా జాబ్‌కు వెళ్లేవారు ఎవ‌రైనా స‌రే.. ఇంట‌ర్వ్యూ అంటే నానా హైరానా ప‌డుతుంటారు. దాన్ని స‌రిగ్గా అటెండ్ చేయ‌గ‌ల‌మా, లేదా అని మాటి మాటికీ ఆలోచిస్తూ కంగారు ప‌డుతుంటారు. అయితే కింద ఇచ్చిన సూచ‌న‌లు పాటిస్తే అలా ఇంట‌ర్వ్యూల్లో కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు. భ‌యం అక్క‌ర్లేదు. దాంతో మీరు క‌చ్చితంగా, కాన్ఫిడెంట్‌గా ఇంట‌ర్వ్యూను అటెండ్ చేస్తారు. జాబ్ కొట్టేస్తారు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఇంట‌ర్వ్యూల‌లో కామ‌న్ గా అంద‌రినీ అడిగే ప్ర‌శ్న‌.. మీ గురించి మీరు చెప్పుకోమని అంటారు. ఇలా ప్ర‌శ్న వేస్తే ఎలాంటి తొంద‌ర పాటు అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. వారు అడుగుతుంది, మీ గురించే క‌దా. మీ గురించి మీకు కాక‌పోతే ఎవ‌రికి తెలుస్తుంది. క‌నుక మీ గురించి మీకు తెలిసిన విష‌యాల‌ను చాలా కాన్ఫిడెంట్‌గా ఇంట‌ర్వ్యూయ‌ర్ల‌కు చెప్పేయండి. దీంతో మీపై వారికి న‌మ్మ‌కం వ‌స్తుంది. పెద్ద‌గా ప్ర‌శ్న‌లు వేయ‌కుంగానే ఇంట‌ర్వ్యూను ముగించేందుకు ఇది తోడ్ప‌డుతుంది. క‌నుక మీ గురించి చెప్ప‌మ‌న్న‌ప్పుడు దానిపై మీరు కాన్ఫిడెంట్ గా చెప్పేందుకు య‌త్నించండి. జాబ్ మీదే అవుతుంది.

follow these 8 tips if you are attending a job interview

ఇంట‌ర్వ్యూ అంటే అందులో మీరు ఒక్క‌రే కాదు, మీలా చాలా మంది అటెండ్ అవుతారు క‌దా. క‌నుక వారంద‌రినీ హెచ్ఆర్ ఇంట‌ర్వ్యూ చేస్తూ పోతే హెచ్ఆర్‌కు హెడేక్ వ‌స్తుంది. వారు విసుగు చెందుతారు. క‌నుక మీ వంతు వ‌చ్చిన‌ప్పుడు మీరు ప్ర‌వర్తించే ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల వారు విసుగు చెందే అవ‌కాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే.. వారిని మీరు వీలైనంత వ‌ర‌కు ప్ర‌శాంతంగా ఉండేందుకు య‌త్నించండి. దీంతో వారికి మీపై మంచి ఇంప్రెష‌న్ ఏర్ప‌డుతుంది. మీరు ఎలాంటి క‌ఠిన‌త‌ర ప‌రిస్థితిలో అయినా వ‌ర్క్ చేయ‌గ‌ల‌రు అని ఇంట‌ర్వ్యూయ‌ర్లు తెలుసుకుంటారు. దీంతో జాబ్ మీ సొంత‌మ‌వుతుంది.

జాబ్ ఇంట‌ర్వ్యూల‌లో వీలైనంత వ‌ర‌కు మిమ్మ‌ల్ని అడిగే ప్ర‌శ్న‌ల‌కు సింపుల్‌గా స‌మాధానాలు చెప్పండి. పెద్ద పెద్ద వాక్యాలు వాడ‌కండి. క్లిష్ట‌త‌ర‌మైన‌, అర్థం చేసుకోలేని ప‌దాల‌ను వాడ‌కండి. అలా వాడితే హెచ్ఆర్‌కు మీపై విసుగు పుట్టి మీ జాబ్ అప్లికేష‌న్‌ను రిజెక్ట్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. మీ గురించి మీరు చెప్పేట‌ప్పుడు మ‌రీ అవ‌స‌రం లేని విష‌యాలు చెప్ప‌కండి. జాబ్‌కు సంబంధం ఉన్న‌వి, అందుకు గాను మీకున్న నైపుణ్యాల‌ను మాత్రం చెబితే చాలు. అలా కాకుండా ఎక్కువ‌గా చెబితే మీరే చిక్కుల్లో ప‌డ‌తారు. మీరు జాబ్ చేయాల‌నుకున్న కంపెనీ గోల్స్ గురించి ముందే తెలుసుకోండి. వాటి గురించి మీరు ప్రాక్టీస్ చేయండి. అవే మీ గోల్స్‌గా నిర్ణ‌యించుకోండి. వాటిని ఇంట‌ర్వ్యూలో మీ గోల్స్‌గా చెప్పండి. అంతే.. ఇంట‌ర్వ్యూయ‌ర్లు ఫ్లాట్ అవుతారు. మీకు జాబ్ గ్యారంటీ.

ఇంట‌ర్వ్యూయ‌ర్లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధానాలు చెప్పండి. విసుగు చెంద‌కండి. కోపం ప్ర‌ద‌ర్శించ‌కండి. అలా చేస్తే మీ జాబ్ అప్లికేష‌న్ రిజెక్ట్ అవుతుంది. మీరు జాబ్ కోసం వ‌చ్చిన కంపెనీలో మీకు వ‌ర్క్ అంటే ఎంత ఇష్ట‌మో ఇంట‌ర్వ్యూయ‌ర్ల‌కు చెప్పండి. దీంతో వారు ఇంప్రెస్ అవుతారు. మీకు జాబ్ ఇస్తారు. ఏ విష‌యంపైనైనా అతిగా చెప్ప‌కండి. ఇంట‌ర్వ్యూయ‌ర్లు అడిగిన ప్ర‌శ్న‌ల మేర‌కు, అవ‌స‌రం ఉన్నంత వ‌ర‌కే స‌మాధానం చెప్పండి. అతిగా స‌మాధానాలు చెబితే మీపై బ్యాడ్ ఇంప్రెష‌న్ ఏర్ప‌డుతుంది. అది జాబ్ ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. క‌నుక ఈ టిప్స్ పాటిస్తే మీకు ఇంట‌ర్వ్యూలో జాబ్ చాలా ఈజీగా వ‌స్తుంది.

Admin

Recent Posts