హెల్త్ టిప్స్

మీరు రోజు చేసే ఈ 7 పనుల వల్ల మీ జుట్టు రాలిపోతుందని మీకు తెలుసా.? హెయిర్ ఫాల్ ను తగ్గించుకోండి..!

నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో ఒకటి హెయిర్‌ ఫాల్‌. స్త్రీలే కాదు, పురుషులు కూడా హెయిర్‌ లాస్‌ వల్ల సతమతమవుతున్నారు. రోజూ రాలిపోయే వెంట్రుకలను చూసి ఉన్న వాటిని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే అనేక పద్ధతులను వారు ట్రై చేస్తున్నారు. అయితే నిజానికి హెయిర్‌ఫాల్‌ అనేది కేవలం విటమిన్ల లోపం, కెమికల్‌ షాంపూలను ఎక్కువగా వాడడం వంటి కారణాల వల్లే కాదు, అది ఇంకా పలు ఇతర కారణాల వల్ల కూడా వస్తుంది. అయితే హెయిర్‌ ఫాల్‌కు కారణమయ్యే ఆ అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం లేదా రాత్రి భోజనంలలో ఏదొ ఒక దాన్ని లేదా కొన్ని సార్లు రెండింటినీ చేయరు. దీని వల్ల ఆహారం నుంచి అందే పోషకాలు శరీరానికి లభించవు. ఫలితంగా అది ముఖ్యమైన అవయవాలకు మాత్రమే శరీరంలో ఉన్న కొవ్వులను ఆహారంగా మార్చి దాన్నుంచి వచ్చే శక్తిని వాటికి చేరవేస్తుంది. దీంతో వెంట్రుకలు, గోర్లు వంటి వాటికి పోషణ అందదు. ఫలితంగా జుట్టుకు పోషణ అందకపోవడం వల్ల అది రాలిపోతుంది. కనుక ఎవరైనా భోజనం ఒక్క పూట కూడా మానేయరాదు. మానేస్తే జుట్టు రాలిపోతుంది.

these are the reasons for hair fall get rid of it

మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండే నీటితో స్నానం చేయరాదు. చేస్తే అది వెంట్రుకలపై ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో జుట్టు రాలిపోతుంది. జుట్టు పొడిగా ఉన్నప్పటి కంటే తడిగా ఉన్నప్పుడే త్వరగా అది రాలిపోయేందుకు అవకాశం ఉంటుంది. కనుక జుట్టు తడిగా ఉన్నప్పుడు తల దువ్వడం, మర్దనా చేయడం వంటి పనులు చేయరాదు. చేస్తే వెంట్రుకలు బాగా రాలిపోతాయి. చాలా మంది టైట్‌గా ఉండే హెయిర్‌ స్టైల్స్‌ను చేయించుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బాగా రాలిపోతాయి. జుట్టును వీలైనంత వరకు లూజ్‌గా ఉండేలా చూసుకోవాలి. దీంతో వెంట్రుకలు సంరక్షింపబడతాయి.

చాలా మంది తడి జుట్టును పొడిగా మార్చేందుకు హెయిర్‌ డ్రయర్స్‌ను వాడుతారు. అయితే ఎవరైనా వాటిని వాడకూడదు. వాడితే వెంట్రుకలు త్వరగా చిట్లి రాలిపోతాయి. చాలా మంది షాంపూలు మాత్రమే కాకుండా కెమికల్స్‌ ఎక్కువగా కలిసే పలు హెయిర్‌ స్టైలింగ్‌ ప్రొడక్ట్స్‌ను ఎక్కువగా వాడుతారు. వాటిని వాడినా జుట్టు సమస్య వస్తుంది. వెంట్రుకలు త్వరగా రాలిపోతాయి. యాంటీ డిప్రెస్సెంట్స్‌, యాంటీ యాంగ్జయిటీ మందులు, యాంటీ హైపర్‌టెన్సివ్‌ మందులు లేదా హార్మోన్ల కోసం (థైరాయిడ్‌ వంటివి) వాడే మందులు హెయిర్‌ఫాల్‌ను కలిగిస్తాయి. ఆయా మందులను వాడినా జుట్టు రాలిపోతూ ఉంటుంది.

Admin

Recent Posts