lifestyle

బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్‌కు అస‌లు ఎంత ఖ‌ర్చ‌వుతుంది..? మ‌న దేశంలో ఉందా..?

ఈ రోజుల్లో అందంగా క‌నిపించాల‌ని చాలా మంది కోరుకుంటున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌లు అయితే అందం ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని అందులో అందంగా క‌నిపించి ఫాలోవ‌ర్ల‌ను పెంచుకోవాల‌ని చూస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ చాలా మంది యువ‌తులు లేదా మ‌హిళ‌లు త‌న వ‌క్షోజాలు చిన్న‌గా ఉన్నాయ‌ని దిగులు చెందుతుంటారు. దీంతో వాటిని పెద్ద‌గా చేసుకునేందుకు స‌ర్జ‌రీల బాట ప‌డుతున్నారు. సెల‌బ్రిటీలు అయితే డ‌బ్బులు ఉంటాయి క‌నుక విదేశాల‌కు వెళ్లి బ్రెస్ట్ అగ్‌మెంటేష‌న్ చేయించుకుంటారు.

అయితే వాస్త‌వంగా చెప్పాలంటే బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుంది..? దీన్ని మన దేశంలో చేయించుకోలేమా..? అని చాలా మంది మ‌హిళ‌లు సందేహం వ్య‌క్తం చేస్తుంటారు. అయితే ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా సెల‌బ్రిటీలు మ‌న దేశంలో బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ చేయించుకోరు. ఎందుకంటే ప‌బ్లిసిటీ భ‌యం. ఫ‌లానా హీరోయిన్ వ‌చ్చి బ్రెస్ట్‌ను పెంచుకుంది అని హాస్పిట‌ల్ వారు చెప్తారు. క‌నుక డ్యామేజ్ అవుతుంది. కాబ‌ట్టి చాలా మంది హీరోయిన్స్ బ్రెస్ట్‌ను పెంచుకునేందుకు విదేశాల‌నే ఎంపిక చేసుకుంటారు.

how much it costs for breast enlargement

అయితే విదేశాల విష‌యానికి వ‌స్తే కాస్మొటిక్ స‌ర్జ‌రీల‌కు ద‌క్షిణ కొరియా చాలా ఫేమ‌స్‌. అక్క‌డ ఈ స‌ర్జ‌రీల‌ను చాలా అల‌వోక‌గా చేస్తారు. అందంగా తీర్చిదిద్దుతారు. పైగా మ‌న గురించి అక్క‌డి వారికి తెలియ‌దు. క‌నుక చాలా మంది ఇలాంటి స‌ర్జ‌రీల కోసం ద‌క్షిణ కొరియాను ప్రిఫ‌ర్ చేస్తారు. అయితే మ‌న దేశంలోనూ అనేక హాస్పిట‌ల్స్ ఉన్నాయి. కాస్మొటిక్ స‌ర్జ‌రీల‌ను మ‌న ద‌గ్గ‌ర కూడా చేస్తారు. ఇక్క‌డ అయితే త‌క్కువ ఖ‌ర్చులో అయిపోతుంది. క‌నీసం రూ.1.50 ల‌క్ష‌ల నుంచి రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు చార్జి చేస్తారు. ఆ మొత్తాన్ని భ‌రించ‌గ‌లిగితే ఎవ‌రైనా స‌రే త‌మ‌కు కావ‌ల్సిన విధంగా బ్రెస్ట్ సైజ్‌ను పెంచుకోవ‌చ్చు.

ఇక ఈ స‌ర్జ‌రీకి పెద్ద‌గా శ్ర‌మించాల్సిన ప‌నిలేదు. 1 లేదా 2 సిట్టింగ్స్‌లో లేదా 1-2 గంట‌ల్లో ప‌ని అయిపోతుంది. రొజంతా హాస్పిట‌ల్‌లో ఉండి సాయంత్రం ఇంటికి వెళ్లిపోవ‌చ్చు. కానీ కొన్ని రోజుల వ‌ర‌కు రెగ్యుల‌ర్‌గా చెక‌ప్ చేయించుకోవాలి. ఇలా బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ చికిత్స‌లు ప‌నిచేస్తాయి.

Admin

Recent Posts