చిన్నప్పుడు స్కూల్స్‌లోనే కాదు, పెద్దయ్యాక బ్యాంకులు, ఆఫీసులు వంటి ఇతర ప్రదేశాల్లోనూ చాలా మంది తమ తమ పెన్నులను పోగొట్టుకుంటుంటారు. ఇది చాలా మందికి అనుభవమే. జేబుకు పెట్టుకుని లేదా చేతిలో పట్టుకుని ఉన్న పెన్నును పక్కవారు అడగ్గానే వెంటనే ఇచ్చేస్తాం. తరువాత దాని సంగతే మరిచిపోతాం. దీంతో ఆ పెన్ను ఎక్కడో మిస్ అవుతుంది. మళ్లీ వేరే పెన్నును వాడాల్సి వస్తుంది. ఇక ఈ తంతు ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అలా ఇప్పటి వరకు చాలా మంది ఎన్నో వందల పెన్నులను పోగొట్టుకుని ఉంటారు. కానీ కింద తెలిపిన విధంగా ఓ టిప్‌ను పాటిస్తే దాంతో ఇకపై మీరు 90 శాతం వరకు అలా పెన్నును పోగొట్టుకోరు. ఇతరులకు ఇచ్చిన మీ పెన్ను మళ్లీ మీ చెంతకు చేరుతుంది. అందుకు ఏం చేయాలంటే…
ఇకపై మిమ్మల్ని ఎవరైనా పెన్ అడిగితే దాని క్యాప్ తీసి ఇవ్వండి. దీంతో వారు తమ పని అయిపోగానే ఆ పెన్నుకు క్యాప్ పెట్టాలని చూస్తారు. అప్పుడు వారికి ఆ పెన్నును మీ వద్ద నుంచి తీసుకున్నట్లు వారికి గుర్తుకు వస్తుంది. దీంతో వారు మీకు ఆ పెన్నును తిరిగిచ్చేస్తారు. ఇది 90 శాతం కరెక్ట్ అవుతుంది. మనుషుల సైకాలజీయే అంత. అలా క్యాప్ లేని వస్తువులను ఏవైనా సరే వెంటనే మూసేయాలని వారికి అనిపిస్తుంది. ఇది హ్యూమన్ సైకాలజీ అట. అందుకే వారు ఆ సమయంలో క్యాప్ కోసం చూస్తారు. అప్పుడు వారికి అది వారి పెన్ను కాదని, మీ నుంచి తీసుకున్నారనే విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఆ పెన్నును మీకు తిరిగిచ్చేస్తారు.
అయితే పైన చెప్పిన టిప్ మీకు తెలియని వారికి పెన్ ఇస్తేనే వర్కవుట్ అవుతుంది. అదే ఆఫీస్‌లో కొలీగ్స్ , మీకు తెలిసిన వారు, ఫ్రెండ్స్ అయితే వర్కవుట్ కాకపోవచ్చు. అయినా ఒక సారి ట్రై చేసి అయితే చూడండి. వర్కవుట్ అయితే బెటరే కదా. ఏమంటారు..!