చనిపోయిన వారి ఆత్మలు మన చుట్టే తిరుగుతాయని, మనతోనే ఉంటాయని చెబుతారు. ఆత్మలనే దెయ్యాలు కూడా అని పిలుస్తారు. కోరిన కోర్కెలు నెరవేరని వారి ఆత్మలు దెయ్యాలుగా మారి అలాగే ఈ లోకంలో ఉంటాయని అంటారు. అయితే దెయ్యాలు నిజంగా ఉంటే అవి మన దగ్గరే ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* దెయ్యాలు విద్యుత్ శక్తిని ప్రభావితం చేస్తాయి. అందువల్ల అవి మన సమీపంలో ఉంటే విద్యుత్‌లో హెచ్చు తగ్గులు వస్తాయి. బల్బులు ఆరిపోయి వెలుగుతుంటాయి.
* ఆత్మలు మన చుట్టూ ఉంటే మన దగ్గర ఉండే వాతావరణం చల్లగా మారుతుంది. గదిలో ఎంత వేడి ఉన్నా అకస్మాత్తుగా చల్లగా అనిపిస్తుంది. ఇలా కొందరికి అవుతుంటుంది.
* మీకు అత్యంత దగ్గరి వారు లేదా ఆత్మీయులు చనిపోతే వారి పేరును పదే పదే మీరు వింటున్నట్లు అనిపిస్తుంటే వారి ఆత్మ మీ దగ్గర ఉన్నట్లు భావించాలి.
* మీ చుట్టూ పరిసరాల్లో ఆత్మలు ఉంటే గడియారాలు అకస్మాత్తుగా ఆగిపోతుంటాయి.
* చుట్టూ దెయ్యాలు గనక ఉంటే అక్కడ సీతాకోక చిలుకలు లేదా కాకులు తిరుగుతుంటాయి. దీన్ని చైనీయులు ఎక్కువగా విశ్వసిస్తారు.
* అత్యంత ఆత్మీయులు చనిపోతే వారు దగ్గరగా ఉన్నట్లు కూడా కొందరికి అనిపిస్తుంటుంది. అయితే సైకిక్స్ చెబుతున్న ప్రకారం వారి ఆత్మల వల్లే ఇలా జరుగుతుంది.
* మీ పరిసరాల్లో దెయ్యాలు గనక ఉంటే కిటికీల బయట నుంచి నీడలు కనిపిస్తుంటాయి.
* నిద్రలో అకస్మాత్తుగా మెళకువ వచ్చినా, నిద్రలో ఉన్నప్పుడు ఛాతి మీద ఏదో ఉన్నట్లు అనిపించినా, గాల్లో పైకి లేస్తున్నట్లు అనిపించినా.. దాన్ని స్లీప్ పెరాలసిస్ అంటారు. కానీ సైకిక్స్ మాత్రం అది ఆత్మల పనే అని చెబుతుంటారు.
* దెయ్యాలు ఉన్న చోట అదో రకమైన దుర్వాసన వస్తుంది.
* ఇంట్లో ఒక చోట ఉంచిన వస్తువులు వేరే చోట దర్శనమిస్తున్నా, గాలి లేకున్నా కిటికీలు, తలుపులు కొట్టుకుంటున్నా, వింతైన శబ్దాలు వినిపిస్తున్నా.. ఆ ఇంట్లో ఆత్మలు ఉన్నట్లు సైకిక్స్ చెబుతుంటారు.