Hair Cut : అబ్బాయిలు తీరిక దొరికినప్పుడు, హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఖాళీ ఎప్పుడు ఉంటే, అప్పుడు ఏ రోజు అనేది కూడా చూసుకోకుండా, హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళుతూ ఉంటారు. సర్వ సాధారణంగా ప్రస్తుత కాలం లో సమయం దొరికినప్పుడు మాత్రమే కటింగ్ చేయించుకుంటున్నారు అంతా. అయితే, ఎప్పుడు హెయిర్ కట్ చేయించుకోవడానికి, మంచి సమయం అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. శాస్త్రాన్ని నమ్మిన వారికి మాత్రమే, పూర్వ పద్ధతులు తెలియజేయడం జరిగింది. ఇందులో చాలా పద్ధతులు ఉన్నాయి. ఎప్పుడైనా సరే క్షవరం చేయించుకునేటప్పుడు, ఈ విషయాలనువు గుర్తుపెట్టుకోవాలి.
ఉదయం 12 గంటల్లోపు చేయించుకుంటే, శుభం కలుగుతుంది. రాత్రి సమయంలో అసలు కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళకూడదు. అలానే, క్షవరం చేయించుకోవడానికి వెళ్లేటప్పుడు ఎప్పుడూ కూడా తండ్రి కొడుకులు, అన్నదమ్ములు ఒకే రోజు చేయించుకోవడానికి వెళ్లకూడదు. ఆదివారం నాడు హెయిర్ కట్ కి వెళ్ళకూడదు. అలా వెళ్లడం వలన ఒక మాసం ఆయువు తగ్గిపోతుంది. దాంతో, శరీరం అధిక వేడి పొందుతుంది. సోమవారం నాడు చేయించుకుంటే, ఏడు మాసాల ఆయువు వృద్ధి చెందుతుంది. సౌఖ్యం కలుగుతుంది.
పుత్రులు కోరుకునే గృహస్తులు, ఒకే ఒక పుత్రుడు కలవారు క్షవరం చేయించుకోకూడదు. మంగళవారం నాడు చేయించుకుంటే, ఎనిమిది మాసాల ఆయువు తగ్గిపోతుంది. దుఃఖం కలుగుతుంది. బుధవారంనాడు చేయించుకుంటే, ఐదు మాసాలు అయివు వృద్ధి చెందుతుంది. పుష్టిని కలిగిస్తుంది.
గురువారం చేయించుకుంటే, పది మాసముల ఆయువు వృద్ది చెందుతుంది. లక్ష్మి ని కోరుకునే వారు, గురువారంనాడు క్షవరం చేయించుకోకూడదు. శుక్రవారం నాడు క్షవరం చేయించుకోవడం వలన, 11 మాసాల ఆయువు వృద్ధి చెందుతుంది. అక్క చెల్లెలు ఉన్నట్లయితే, శుక్రవారం చేయించుకోకూడదు. శనివారం నాడు చేయించుకుంటే, ఏడు మాసాల ఆయువు తగ్గుతుంది. రోగాలు వస్తాయి.