lifestyle

Kaliyugam : కలియుగం ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందో తెలుసా..?

Kaliyugam : మొత్తం నాలుగు యుగాలు ఉన్నాయన్న సంగతి మనకి తెలుసు. మొదటి యుగమైన సత్యయుగంలో, ధర్మం నాలుగు పాదాలు మీద నడిచింది. రెండో యుగమైన త్రేతాయుగంలో, ధర్మం మూడు పాదాల మీద నడిస్తే, మూడవ యుగం ద్వాపర యుగంలో రెండు పాదాల మీద నడిచింది. ప్రస్తుతం కలియుగంలో ధర్మం అనే మాటలకి ఇప్పుడు చోటే లేదు. సత్య యుగంలో భగవంతుడు నారాయణుడు లక్ష్మీ సహితంగా భూమిని పరిపాలించాడు. 17 లక్షల 28 వేల సంవత్సరాలు ఈ యుగం యొక్క కాల పరిమాణం. ధర్మం నాలుగు పాదాలు మీద నడిచిందని శివపురాణంలో చెప్పబడింది. ఈ యుగంలో ఎలాంటి బాధలు, ఎలాంటి కష్టాలు లేకుండా ప్రజలు జీవించేవారు.

అసలు అకాల మరణాలే లేవు. కృత యుగానికి రాజు సూర్యుడు. మంత్రి గురువు అధిపతి కావడంతో అంతా బంగారమయం. ప్రభువుకి, ప్రజలకి మధ్య ఎలాంటి విభేదం ఉండేది కాదు. విరోధం లేకుండా చక్కగా రోజులు నడిచేవట. ఇక త్రేత యుగంలో, శ్రీరామచంద్రుడుగా భగవంతుడు అవతరించి రావణాసురుడుని సంహరించి, ధర్మసంస్థాపన చేశాడు. 12 లక్షల 96 వేల సంవత్సరాలు ఈ యుగం యొక్క పరిమితి. త్రేతా యుగంలో రాజుగా కుజుడు, మంత్రిగా శుక్రుడు ఉన్నారు. కుజుడు యువకుడు. యుద్ధ ప్రియుడు.

how many years left in kali yugam

రాజుగా ఆచారాలకి కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు. మంత్రులు క్రూర స్వభావులై, రాజపాలనని బ్రష్టు పట్టించారు. స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి, దైవ కార్యాలు నిర్వహించే వంశాలని అంతరించేలా చేసారు. ఇక ద్వాపరయుగం విషయానికి వస్తే, శ్రీకృష్ణుడిగా శ్రీమహావిష్ణువు అవతరించాడు. ఎనిమిది లక్షల 64 వేల సంవత్సరాలు ఈ కాల పరిమాణం. చంద్రుడు రాజుగా, మంత్రిగా బుధుడు ఉన్నారు. చంద్రుడికి, బుధుడుకి ఒకరంటే ఒకరికి పడదు. దేవతా కార్యాలని సగానికి సగం నాశనం చేశారు.

ఇలా ద్వాపరయుగంలో ధర్మం రెండు భాగాలుగా నశించి, కలియుగం వచ్చింది. కలియుగం కాలపరిమితి నాలుగు లక్షల 32000 సంవత్సరాలు. సుమారు 5000 సంవత్సరాలు గడిచిపోయాయి. కలియుగానికి రాజు శని, మంత్రులు రాహు కేతువులు. మంత్రులు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కలియుగంలో అసత్యం, క్రూరత్వం, అధర్మం, అన్యాయం తలెత్తుతాయి. దైవభక్తి తగ్గుతుంది. హింస సిద్ధాంతాలు పెరుగుతాయి. పాపం వల్ల దుఃఖం అనుభవిస్తాం అనే భయం పోతుంది. స్త్రీని, ధనాన్ని పొందిన వాడే గొప్పవాడని అనుకునే రోజులు వస్తాయి. అధర్మం బాగా పెరుగుతుంది. కలియుగంలో మంచి అనే మాటకి చోటే ఉండదు. అధర్మం వైపు అందరూ ఆసక్తి చూపుతారు అని శివపురాణం లో చెప్పబడింది.

Admin

Recent Posts