నీలి చిత్రాలు.. పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయ్.! అన్యోన్యంగా ఉండాల్సిన భార్య భర్తల మద్య అంతులేనంత గ్యాప్ ను క్రియేట్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జరిపిన సర్వే ప్రకారం ఈ వీడియోస్…. ఆలుమగల బంధానికి ఏవిధంగా బీటలు పడేలా చేస్తున్నాయో తెలుస్తోంది. భర్తలకు నీలి చిత్రాల మీద మాత్రమే ఆసక్తి ఉండటంతో భార్యలపై ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో వారి శృంగార దాంపత్యం సాఫీగా సాగకపోవడమే కాకుండా భర్త పట్ల భార్యకు అనుమానాలను కలిగేలా చేస్తోంది.
నీలి చిత్రాల వీడియోస్ తరహా సెక్స్ కావాలని చాలా మంది భర్తలు భార్యలను హింసిస్తున్నారు. ఈ కారణం వల్ల భార్యలకు శృంగారం మీదనే ఆసక్తిపోయి..భర్త అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. విడాకుల కేసుల్లో 45 శాతం ఇలాంటి మూవీస్ యే కారణమట. ఈ వీడియోస్ కు బానిసైన వారు…వారు కూడా అదే స్థాయిలో శృంగారంలో పాల్గొనాలనే వాంఛతో ఉత్ప్రేరకాలు వాడడం….ఆ భంగిమలను భార్యలపై ప్రయోగించడం చేస్తారట.
ఈ వీడియోస్ చూసే వారు.. ఇతరులను ఎప్పుడూ తప్పుడు ఉద్దేశ్యంతోనే చూస్తారట. వారి కామాన్ని తీర్చుకోవడం కోసం….చిన్నపిల్లలు, జంతువులను ఆశ్రయించడానికి కూడా వెనకాడరట. శృంగారమంటే స్త్రీ పురుషులిద్దరూ సంతృప్తి చెందే ఓ రసాస్వాదన. కానీ ఈ వీడియోస్ కారణంగా…శృంగారమంటే పూర్తిగా భర్తల ఆదిపత్యం మాత్రమే అనుకునే ధోరణి పెరిగిందనేది సెక్సాలజిస్ట్ ల వాదన.