కొత్తగా ఉద్యోగంలో చేరేవారైనా, ఇప్పటికే ఏదైనా కంపెనీలో చేసి ఉండి మరో కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్తున్నా… ఎవరైనా సరే ఇంటర్వ్యూకు అటెండ్ కావల్సి ఉంటుంది. అలా చేశాకే ఉద్యోగం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఏ జాబ్ కోసం ఏ కంపెనీకి ఇంటర్వ్యూకు వెళ్లినా ఎవరికైనా ఇంటర్వ్యూను అటెండ్ అవడం అంటే.. అది మామూలు విషయం కాదు. ఇంటర్వ్యూయర్లు అడిగే క్లిష్టతరమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే అది సరే.. ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యే వారు ఎవరికైనా కష్టతరమైన ప్రశ్నలనే వేస్తారు. కానీ మీకు తెలుసా..? ఇంటర్వ్యూకు వెళ్లేవారు మాత్రం కింద ఇచ్చిన కొన్ని సూచనలను కచ్చితంగా పాటించాలి. అవేమిటంటే…
ఇంటర్వ్యూకు ఆలస్యంగా వెళ్లవద్దు. మీకు ఇచ్చిన టైము కన్నా కనీసం 30 నిమిషాల ముందుగానే ఇంటర్ల్యూ ప్లేస్‌కు చేరుకోవాలి. దీంతో మీ ఇంటర్వ్యూయర్ల దృష్టిలో మీపై మంచి ఇంప్రెషన్ పడుతుంది. ఆలస్యంగా వెళ్తే మీకు టైం సెన్స్ లేదని అనుకుంటారు. కనుక ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని గుర్తుంచుకోవాలి. ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లేముందు మీ ఫోన్ ను స్విచాఫ్ చేయండి. ఫోన్ ను సైలెంట్ లేదా వైబ్రేషన్ మోడ్‌లో కూడా పెట్టవద్దు. అలా పెడితే కాల్స్, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంటర్వ్యూ చేసే వారు మన స్నేహితులు కాదు కదా. కనుక వారితో ఫార్మల్‌గా మాట్లాడాలి. వారికి బాగా రెస్‌పెక్ట్ ఇస్తూ మాటలు కొనసాగించాలి. సర్, మేడమ్ పదాలను బాగా వాడాలి. దీంతో మీరు ఇతరులకు బాగా మర్యాద ఇస్తారని వారు అనుకుంటారు. వారికి మీపై మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది.
ఇంటర్య్యూ అయ్యే సమయంలో ఎక్కువగా యాటిట్యూడ్ చూపించకండి. డీసెంట్‌గా ఉండేందుకు యత్నించండి. మీపై మీకు అపారమైన నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉన్నట్టు ప్రవర్తించండి. ఇంటర్వ్యూకు వెళ్లేవారు చేసే పొరపాట్లలో డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఒకటి. చాలా మంది ఫ్యాషన్‌గా ఉండేలా దుస్తులు వేసుకుంటారు. కానీ అది పనికి రాదు. ఫార్మల్ డ్రెస్సులనే వేసుకోవాలి. మీరు గతంలో పనిచేసిన కంపెనీలను లేదా వాటిలో ఎవరైనా ఉద్యోగులను, అధికారులను ప్రస్తుతం ఇంటర్వ్యూలలో ప్రస్తావించాల్సి వస్తే వారిని తిట్టకండి. అలా చేస్తే మీపై ఇంటర్వ్యూయర్లకు బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఇక ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యేవారు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం. అబద్దాలు చెప్పడం. మీ గురించి, మీ క్వాలిఫికేషన్స్ గురించి, స్కిల్స్ గురించి, ఇతరుల గురించి అబద్దాలు అస్సలు చెప్పరాదు. చెబితే తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది.