ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒక మరపురాని అద్భుత ఘట్టం.. ఈ ఘట్టం మొదలైనప్పటి నుంచి ఎన్నో కష్టాలు, సుఖాలు, ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటినీ తట్టుకొని దంపతులు అన్యోన్యంగా జీవించాలంటే ఇద్దరి మధ్య కంపాటబులిటీ అనేది తప్పనిసరిగా ఉండాలి. మరి ఈ కంపాటబులిటీ ఏ విషయాల్లో ఉండాలో ఇప్పుడు చూద్దాం.. ఇద్దరి మధ్య కంపాటబులిటీ ఉంటే దంపతులిద్దరూ ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. వీరిద్దరూ ఏ సమయంలో ఎలా ఉంటారు అనే విషయాన్ని కూడా పూర్తిగా ఒకరికొకరు తెలుసుకుంటారు.
ఇద్దరి మధ్య కంపాటబులిటీ బాగుంటే తమ జీవిత భాగస్వామిని ఏ విషయంలో కూడా అది మార్చుకోమని చెప్పరు. ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటారు. ఇద్దరి మధ్య ఇష్టాలు అనేవీ ఒకే విధంగా ఉండాలని రూల్ లేదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే దంపతులు అయితే ఒకరి ఇష్టాన్ని మరొకరు గౌరవిస్తూ ఉంటారు. ఒకవేళ వీరిద్దరి మధ్య కామన్ ఇష్టాలు ఉంటే ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అన్యోన్యంగా ఉండే దంపతుల మధ్య తరచూ గొడవలు వస్తూ ఉంటాయట. ఇది మీరు నమ్మకపోయినా సరే ఇదే నిజం దంపతులు గొడవ పడడం కూడా వారి మధ్య ఉన్న బలమైన బంధానికి చిహ్నం.
ఇద్దరు అర్థం చేసుకునే దంపతులైతే వారు తమ భవిష్యత్ కు సంబంధించిన ప్రతి విషయంలోనూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. అది ఏ విషయమైనా ఇద్దరు చర్చించుకొని తుది నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు దంపతులు కలిసి చర్చించి సమస్య పరిష్కారానికి ముందడుగు వేస్తారు.. ఈ విధంగా కుటుంబంలో ఎలాంటి సమస్య రాకుండా కూడా చూసుకుంటారు.