lifestyle

మీకు లేని పోని భ‌యాలు క‌లుగుతున్నాయా.. అయితే ఇలా చేయండి..!

సాధారణంగా కొన్ని కొన్ని సార్లు ఏదో ఒక భయంకరమైన ఆలోచన మనలో కలుగుతుంది. ఏ పని చేయాలనుకున్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా… ఆ భయం వెంటాడుతూ ఉంటుంది. భయంకరమైన ఆలోచన నుంచి బయటపడాలి అన్నా కాస్త కష్టంగానే ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల మీరు భయంకరమైన ఆలోచన నుంచి బయట పడడానికి వీలవుతుంది. ఎప్పుడైతే మీరు ఏదైనా సాల్వ్ చేసుకోవాలంటే మొదట కారణాలు కావాలి. అలానే మీకు అసలు భయం ఎందుకు కలుగుతోంది..? అసలు భయం ఎందుకు వచ్చింది…? దానిని మీరు తెలుసుకోండి. ఇలా కారణాలని తెలుసుకుని నెమ్మదిగా బయటపడండి.

ఏమీ కాదు, నాకు భయం లేదు… అలాంటివి మీకు మీరు చెప్పుకోండి. అలానే రోజుకి ఒక అరగంట సేపు వాకింగ్ చేయడం లేదా పది నిమిషాల పాటు మెడిటేషన్ చేయడం లాంటివి చేయండి. దీని వల్ల మీరు మీ దృష్టిని మార్చుకోగలరు.

if you fear about some thing do like this

పాజిటివ్ గా ఆలోచిస్తే మీకు ప్రశాంతత ఉంటుంది. అలానే లేని పోని భయాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి వీలైనంత పాజిటివ్ గా మీరు ఆలోచించడం ముఖ్యం. దీని వలన మీకు భయం కూడా తొలగిపోతుంది.

Admin

Recent Posts