Home Tips

ఇండియన్ టాయిలెట్ vs వెస్ట్రన్ ఆరోగ్యానికి ఏది మంచిది?

ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో బాత్రూంలో ఉంటున్నాయి. గతంలో, చాలామంది ఆరుబయటనే మల, మూత్ర విసర్జన చేసేవారు. కానీ, కాలక్రమేణా, అందరూ ఇంట్లోనే బాత్రూంలు కట్టుకుంటున్నారు. అయితే, ఇది ఇలా ఉండగా, ఇంట్లో టాయిలెట్ సీటు వేసుకునేటప్పుడు ఏ కమోడ్ పెట్టుకోవాలి అనే ఆలోచన మీ మదిలో ఉంటుంది. అయితే… ఇండియన్ టాయిలెట్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. ఆరోగ్యానికి ఏది మంచిది?.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియన్ టాయిలెట్ లో స్క్వాట్ పొజిషన్ లో కూర్చోవడం వల్ల పెల్విక్ ప్రొలాప్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్క్వాట్ పొజిషన్ లో కూర్చున్నప్పుడు, మలాన్ని పూర్తిగా క్లియర్ చేయడానికి ప్రేగులపై ఒత్తిడి తెస్తుంది. ఇలా చేస్తే పొట్ట బాగా క్లీన్ అవుతుంది. ఈ స్థితిలో కూర్చోవడం వల్ల తొడలు, పెల్విక్ ప్రాంతాన్ని బలోపేతం చేస్తుంది. టాయిలెట్ లో స్క్వాట్ పొజిషన్ లో కూర్చున్నప్పుడు, వీపును నిటారుగా ఉంచుతారు. ఇది సమతుల్యతను కాపాడుతుంది. మీరు పడిపోకుండా జాగ్రత్త పడొచ్చు.

indian vs western toilet which one is better for us

వెస్ట్రన్ టాయిలెట్ షీట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వెస్ట్రన్ టాయిలెట్ ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆరోగ్యవంతమైన వ్యక్తులు కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మీరు దీన్ని చాలా ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో చూడవ చ్చు. కానీ ఆరోగ్య రీత్యా ఇండియ‌న్ టైప్ టాయిలెట్‌ను వాడ‌డ‌మే మంచిది. మీకు ఏదైనా అనారోగ్య స‌మ‌స్య ఉంటే త‌ప్ప ఇండియ‌న్ టాయిలెట్‌ను వాడాల్సి ఉంటుంది.

Admin

Recent Posts