lifestyle

జ్వ‌రం వ‌చ్చిన వారు అర‌టి పండ్ల‌ను తినాలి.. ఎందుకంటే..?

అరటి పండు లో చ‌క్కెర…సుక్రోజ్ ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివి సహజరూపం లో ఉంటాయి. పీచు పదార్ధాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. రెండు అరటిపండ్లు తింటే 90 నిమిషాల పాటు పని చేయవచ్చని పరిశోధనల్లో రుజువైంది. అందుకే క్రీడాకారులు ఎక్కువగా అరటిపండు తీసుకుంటారు. అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవటానికి అరటిపండు మంచి ఆహారం. కాబట్టి ప్రతీరోజూ అరటిపండు తింటే శక్తితో పాటు జీర్ణవ్యవస్ధ పని తీరు మెరుగవుతుంది. దగ్గు నివారణకు గొంతు మంటకు మందుగా పనిచేస్తుంది. డయేరియా నుంచి విముక్తి లభిస్తుంది.

తేనె రక్తాన్ని శుద్ధి చేసి, బ్లడ్‌ సర్క్యులేషన్‌ని క్రమబద్దీకరిస్తుంది. కాలిన గాయాలను త్వరగా తగ్గిస్తుంది. అల్సర్‌ను నివారిస్తుంది. తేనెలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాటివల్ల సులభంగా జీర్ణమవుతుంది. ప్రతిరోజూ ఒక టేబుల్‌స్పూన్‌ తేనె నీటిలో కలిపి పరగడుపునే తీసుకుంటే కిడ్నీలు బాగా పనిచేస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరగడానికి క్రమం తప్పకుండా తేనె ఏదో ఒక రకంగా ఇవ్వాలి.
నోటి పూత, నోటిలో గుల్లలు వంటి సమస్యల నివారణకు తేనె వాడొచ్చు.

if you have fever you must take banana know why

చక్కెరతో పోల్చితే తేనెలో క్యాలరీలు తక్కువ. తేనెలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువ. అధిక బరువును తగ్గించడంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, ఒక చెక్క నిమ్మరసం కలుపుకొని తాగితే స్థూలకాయాన్ని నివారించవచ్చు. కడుపు నొప్పికి ఇది మంచి మందు. ఎనీమియా, ఆస్తమా, బట్టతల, తీవ్రమైన జ్వరం, తలనొప్పి, బిపి, ఒత్తిడి, పక్షవాతం వంటి అనేక వ్యాధులను దూరంగా ఉంచుతుంది.

Admin

Recent Posts