Chanakya : చాణక్య ఎన్నో అద్భుతమైన విషయాను చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేస్తే, జీవితం చాలా బాగుంటుంది. చాణక్య ఏ సమస్యని, ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది చెప్పడంతో పాటుగా, సమస్యలు లేకుండా ఎలా సంతోషంగా ఉండాలి..? అలానే భార్యాభర్తల మధ్య రిలేషన్ బాగుండాలంటే ఏం చేయాలి..? కుటుంబంలో గొడవలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి..? ఇలా చాలా విషయాలను చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేస్తే, జీవితం చాలా బాగుంటుంది. అలానే, చాణక్య శునకం నుండి నేర్చుకోవాల్సిన విషయాల గురించి కూడా చెప్పారు.
నిజానికి మనిషి ప్రతిరోజు కూడా, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ ఉండడం వలన, మనిషి తనని తాను మరింత బెటర్ గా మార్చుకోవచ్చు. చాణక్య శునకం నుండి నేర్చుకోవాల్సిన విషయాలని చెప్పారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. కుక్క లో ఉండే సంతృప్తి భావన మనుషుల్లో కూడా ఉండాలని చాణక్య చెప్పారు. కుక్క బాగా ఆకలి వేసినప్పుడు, ఏది లభిస్తే అది సంతృప్తిగా తిని, కడుపు నింపుకుంటుంది. అలానే, మనిషి కూడా, ఆ విధంగానే తినాలని చాణక్య అన్నారు.
దొరికిన దాంతో కడుపుని నింపుకోవాలని, అత్యాశ ఎక్కువ అవ్వకూడదని, అత్యాశ ఎక్కువ ఉంటే అశాంతి కూడా ఉంటుందని చాణక్య అన్నారు. అలానే, మనుషులు ఎప్పుడూ కూడా శునకాలని నిద్రపోవాలని చెప్పారు. ఎప్పుడూ కూడా శునకాలు అప్రమత్తంగా ఉంటూనే, కొంచెం శబ్దమైనా వెంటనే మేల్కొంటూ ఉంటారు. మనుషులు కూడా అలానే నిద్రపోవాలి. ఇలా, నిద్రపోవడం ఎప్పుడు సురక్షితం అని చెప్పారు చాణక్య.
కుక్క చాలా నమ్మకమైన జంతువు. చాణక్య కుక్క నుండి మనుషులు విశ్వాసపాత్రంగా ఉండాలని విషయాన్ని నేర్చుకోవాలని చెప్పారు. విశ్వాసపాత్రంగా విధేయతగా ఉండాలని అన్నారు. ఈ లక్షణాలు ఉంటే, మనిషి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారని ప్రజలు కూడా అతనిలోని నిజాయితీని త్వరగా గుర్తిస్తారని చాణక్య అన్నారు. కుక్క నిర్భయ జంతువు. ప్రతి సమస్యని కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని కుక్క నుండి నేర్చుకోవాలి మనుషులు అని చాణక్య అన్నారు. ఇటువంటి సద్గుణాలని కుక్కనుండి నేర్చుకోవాలి. ప్రతి సమస్యను దృఢంగా ఎదుర్కోవాలని చెప్పారు చాణక్య.