lifestyle

వేడి చేసినప్పుడు పాలు ఎందుకు పొంగుతాయి.? నీళ్లు ఎందుకు పొంగవు.?

<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు పొంగడం అంటే పాలలో అధిక మోతాదులో ఉన్న నీళ్లు పొంగుతాయన్న విషయం తెలుసుకోవాలి&period; పాలు నిర్దిష్టమైన ఒకే పదార్థం కాదు&period; ఉప్పు లాగా&comma; చక్కెర లాగా&comma; క్లోరోఫారం లాగా&comma; ఆక్సిజన్ లాగా అది ఒక శుద్ధమైన సంయోగ పదార్థమో&comma; మూలకమో కాదు&period; పాలు ఓ మిశ్రమ పదార్థం&period; అలాగని ఉప్పు&comma; నీళ్లలాగా&comma; చక్కెర ద్రావణం లాగా&comma; సోడా బాటిల్ లోని నీళ్లలాగా&comma; సమ సంఘటన ద్రావణం కూడా కాదు&period; పాలను కొల్లాయిడ్ తరహా మిశ్రమ పదార్థం అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంటే అందులో ద్రావణి అయిన నీటితోపాటు&comma; కరిగిన కొన్ని లవణాలు&comma; చక్కెరలతో పాటు కరగకుండా పాలలో అన్ని వైపులకు విస్తరించి ఉన్న పెద్ద పెద్ద అణువులు ప్రోటీన్ పీలికలు&comma; జీవ రసాయన బృహద‌ణువులు ఉంటాయి&period; వీటికి తోడుగా చక్కెర గుళిక మీద చీమలు గుమిగూడినట్టు చిన్నపాటి నీటి బిందువుల చుట్టూ పాతుకుపోయిన తైల కణాలు&comma; తైల బిందువుల చుట్టూ ఇదే విధంగా పేరుకున్న నీటి బిందువులు ఉండే సమూహాలు కూడా ఉంటాయి&period; ఇలాంటి సమూహాలను మైసెల్స్ అంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75302 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;milk-5&period;jpg" alt&equals;"why milk overflows upon boiling " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఎన్నో పదార్థాల సమ్మేళనమే పాలు&period; ఇలాంటి పాలను వేడి చేసినప్పుడు ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్ కు దాటే సమయంలో పాలలోని నీరు ద్రవ స్థితి నుంచి వాయుస్థితిగా మారే క్రమంలో బుడగలు ఏర్పడతాయి&period; అయితే పాలలో వివిధ పదార్థాలు ఉండటం వల్ల పాలలో ఉష్ణం అన్ని వైపులకు ఒకే విధంగా విస్తరించదు&period; క్రింద భాగాన అధిక వేడి పై భాగంలో తైలబిందువులు తేలడం వల్ల తక్కువ వేడి ఉంటుంది&period; కాబట్టి కిందనే మొదట ఏర్పడ్డ నీటి ఆవిరి బుడగలు తమపై ఉన్న పాల భాగాన్ని నెట్టుకుంటూ పైకి వెళతాయి&period; అందువల్లే పాలు పొంగుతాయి&period; కానీ నీటి విషయం అలా కాదు&period; నీరు శుద్ధమైన ద్రావణి కాబట్టి ఉష్ణం అన్ని వైపులకు ఉష్ణ సంవహనం అనే పద్ధతిలో చేరడం వల్ల నీటిలో అన్ని భాగాల్లోనూ బుడగలు వస్తాయి&period; కాబట్టి పొంగకుండా పైనున్న బుడగలు గాలిలో కలుస్తుంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts