lifestyle

Yawning : ఆవులింత తీసిన‌ప్పుడు క‌ళ్ల నుంచి నీరు ఎందుకు వ‌స్తుందో తెలుసా..?

Yawning : మాన‌వ శ‌రీర‌మే ఓ చిత్ర‌మైన నిర్మాణం. ఎన్నో ల‌క్ష‌ల క‌ణాలు, క‌ణ‌జాలాల‌తో నిర్మాణ‌మైంది. ఎన్నో అవ‌య‌వాలు వాటి విధులు నిత్యం నిర్వ‌ర్తిస్తుంటాయి. ఈ క్ర‌మంలో మ‌నం మ‌న‌కు తెలియ‌కుండానే శ‌రీరం ద్వారా కొన్ని స‌హ‌జ‌మైన ప్ర‌క్రియ‌ల‌ను రోజూ ఆయా సంద‌ర్భాల్లో నిర్వ‌హిస్తుంటాం. అలాంటి వాటిలో ఒక‌టే ఆవులింత‌. అయితే అస‌లు ఆవులింత‌లు ఎందుకు వ‌స్తాయో మీకు తెలుసా..?

శ‌రీరం బాగా అల‌సిపోయినప్పుడు, త‌గినంత నిద్ర పోన‌ప్పుడు మ‌న శ‌రీరంలో ఆక్సిజ‌న్ శాతం త‌గ్గుతుంది. ఈ క్ర‌మంలో ఆ ఆక్సిజ‌న్‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆవులింత‌లు వ‌స్తాయి. ఆవులింత వ‌చ్చిన‌ప్పుడు పెద్ద మొత్తంలో గాలి మ‌న శ‌రీరం లోప‌లికి వెళ్తుంది. దీని వల్ల మ‌న‌కు ఆక్సిజ‌న్ ఎక్కువ‌గా అందుతుంది. అనంత‌రం అదే మొత్తంలో కార్బ‌న్ డ‌యాక్సైడ్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఈ ప్ర‌క్రియ వ‌ల్ల మ‌న శ‌రీరం రిలాక్స్ అయి ఉత్తేజంగా ఉంటుంది. అయితే ఆవులింత తీసే స‌మ‌యంలో మ‌న క‌ళ్ల నుంచి నీరు ఎందుకు వ‌స్తుందో మీకు తెలుసా..?

why tears come from eyes when we yawn

నీళ్లు ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల ఆవులింత‌లు తీసిన‌ప్పుడు క‌ళ్ల నుంచి నీరు వ‌స్తుంద‌నుకుంటే మీరు పొర‌పాటు ప‌డిన‌ట్టే. ఎందుకంటే అలా నీరు రావ‌డం వెనుక ఉన్న విష‌యం మాత్రం అది కాదు. ఆవులింత తీసిన‌ప్పుడు కళ్లు మూసుకుంటాం క‌దా. అలా మూసుకున్న‌ప్పుడు కంటి రెప్ప‌లు ముక్కు పై భాగం ప‌క్క‌న క‌లుసుకునే punctum అనే పాయింట్ lacrimal గ్రంథుల‌పై ఒత్తిడిని క‌లిగిస్తాయి. ఈ క్రమంలో కంటి పై రెప్ప‌లు ద‌గ్గ‌ర‌కు ముడుచుకుని కంట్లో నుంచి నీటిని బ‌య‌ట‌కు పంపిస్తాయి. అందుకే మ‌నం ఆవులింత తీసిన‌ప్పుడు కళ్ల నుంచి నీరు వ‌స్తుంది. అయితే ఇలా జ‌ర‌గ‌డం అత్యంత స‌హ‌జ‌మైన ప్ర‌క్రియే. దీని వల్ల మ‌న‌కు ఎలాంటి హాని లేదు. క‌ళ్లు పొడిబార‌కుండా ఉండేందుకే అలా జ‌రుగుతుంది. కాబ‌ట్టి ఇక ముందు మీరు ఆవులింత తీసిన‌ప్పుడు క‌ళ్ల నుంచి నీరు వ‌స్తే ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు.

Admin

Recent Posts