lifestyle

Nighty : నైటీ వేసుకునే ఆడవాళ్లు.. తప్పక ఈ విషయాలని తెలుసుకోవాలి..!

Nighty : ఈ రోజుల్లో చాలా మంది సింపుల్ గా ఉంటుందని, ఏ బాధ ఉండకుండా ఫ్రీగా ఉంటుందని నైటీ వేసుకుంటున్నారు. నైటీ రోజూ వేసుకుంటే చికాకు ఉండదు. ఫ్రీ గా ఉంటుంది అని చాలా మంది ఇళ్లల్లో ఉండే మహిళలు నైటీనే వేసుకుంటున్నారు. స్త్రీ నిజానికి చాలా శక్తివంతమైనది. పురుషుడి కంటే కూడా శారీరకంగా, మానసికంగా స్త్రీ చాలా శక్తివంతమైనది. ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది చెప్పొచ్చు.

ఎంత ఔన్న‌త్యాన్ని కలిగిన వ్యక్తి అనేది మనం ఆ ఇంటిని చూసి చెప్పొచ్చు. ఇంటిని బట్టి స్త్రీ ఎంత ఉన్నతమైన భావాలని కలిగి ఉంది అనేది మనం చెప్పొచ్చు. అందుకే పెద్దలు ఇంటిని చూడు ఇల్లాలిని చూడు అంటారు. ప్రతి స్త్రీ లో, ప్రతి పురుషుడిలో మాతృత్వ లక్షణాలు ఉంటాయి. అయితే రోజు రోజుకీ వస్త్రధారణ మారిపోయింది. ఇది వరకు ఎక్కువ మంది చీరల‌ని మాత్రమే కట్టుకునే వాళ్ళు. ఆ తరవాత డ్రెస్సులు వచ్చాయి.

women who wear nighty must know these

ఇలా వస్త్రధారణ విషయంలో అనేక మార్పులు వచ్చాయి. పూర్వకాలంలో స్త్రీలు చీరల్ని కట్టుకునేవారు. దాని వలన ఆకృతి కూడా బాగుండేది. కానీ డ్రెస్సులు, వివిధ రకాల బట్టలు, నైటీలు వంటివి వేసుకున్న తర్వాత స్త్రీ యొక్క ఆకృతి మారుతూ వస్తోంది. కొవ్వు ఎక్కడైతే పెరుగుతుందో ఆ ప్రాంతాన్ని, ఆ శరీర భాగాన్ని గట్టిగా బిగపెట్టి ఆ ప్రాంతంలో కొవ్వు చేరకుండా మన దుస్తులు చూస్తాయి.

అందుకని పూర్వకాలంలో చీరల్ని కట్టుకునేవారు. అందం, వయ్యారం, గౌరవం చీర కట్టుకున్న స్త్రీ కి కలుగుతాయి. నైటీ ధరించడం వలన శరీరాకృతి బాగా మారిపోతుంది. కంఫర్ట్ కోసం చూసుకుంటే, శరీర ఆకృతి పాడవడమే కాకుండా చూడడానికి అంత బాగోదు. పైగా నలుగురు హేళన కూడా చేస్తున్నారు. పైగా ఏకవస్త్రం అనేది మంగళకరమైనది కాదు. కాబట్టి నైటీలు ధరించే వాళ్ళు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోండి.

Admin

Recent Posts