ఒంట్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతే, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వలన కిడ్నీ మలినాలను బయటకి పంపించలేదు, దీంతో, అనేక ఇబ్బందులు వస్తాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించాలి. అలాగే, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలని కూడా పాటించవచ్చు.
ముందుగా ఆనపకాయని తొక్క తీసుకోవాలి. అలాగే ఆపిల్, కీరదోసని కూడా తొక్క తీసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ లో కొంచెం నీళ్లు వేసి పేస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక క్లాత్ సహాయంతో జ్యూస్ ని ఫిల్టర్ చేసుకోవాలి. మీరు కావాలంటే వీటిని తురిమి అయినా సరే చేసుకోవచ్చు. ఆ తర్వాత తిప్పతీగ వేరుని దంచి కొంచెం నీళ్లు పోయాలి. రెండు మూడు నాలుగు స్పూన్లు ఈ జ్యూస్ ని తీసుకోవాలి.
ఇందాక పక్కన పెట్టుకున్న దానిలో ఈ తిప్పతీగ జ్యూస్ ని మిక్స్ చేయాలి. ఇందులోనే తులసిని కూడా క్రష్ చేసి వేయాలి. కలబంద గుజ్జుని కూడా ఇందులో కొంచెం వేయండి. కొంచెం రుచికి సాల్ట్ వేయాలి. ఖాళీ కడుపుతో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తో బాధపడే వాళ్ళు దీనిని తీసుకోవడం వలన పది పదిహేను రోజుల్లో తగ్గిపోతుంది. ఈ జ్యూస్ ని తాగడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.