వైద్య విజ్ఞానం

దోమకాటుతో AIDS వస్తుందా.? వైద్యులు ఏమంటున్నారు..?

AIDS ఎంత భయంకరమైన వ్యాధో అందరికీ తెలిసిందే…దాని బారిన పడితే ఇక అంతే సంగతులు. దానిని నివారించడానికి చాలా దేశాల్లో అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దాని పట్ల జనాల్లో కూడా చాలా అవేర్ నెస్ వచ్చింది, అయినప్పటికీ ఇంకా చదువుకోని వాళ్ళల్లో ఈ మహమ్మారి వ్యాధి పట్ల అవగాహన కరువైంది. దీంతో ఈ ఎయిడ్స్ మీద అనేక అనుమానాలు కలుగుతున్నాయ్. తాజాగా దోమకాటుతో aids వస్తుంది అంటూ ఒక రూమర్ గట్టి ప్రచారంలో కూడా ఉంది. అయితే ఇది ఎంత వరకు నిజం… అనే దానిపై వైద్య నిపుణులు స‌మాధానం చెబుతున్నారు. దోమ‌కాటు వ‌ల్ల ఎయిడ్స్ వ‌స్తుందా.. అన్న ప్ర‌శ్న‌కు వారు స‌మాధానం చెప్పారు.

దోమ కుట్ట‌డం వ‌ల్ల ఎయిడ్స్ వ‌స్తుంద‌న్న ప్ర‌చారంలో నిజం లేద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎయిడ్స్‌కు కార‌ణం అయ్యే హెచ్ఐవీ దోమ‌కాటు వ‌ల్ల వ్యాప్తి చెంద‌దు. ర‌క్తంలో నేరుగా క‌ల‌వ‌డం, లేదా అసుర‌క్షిత‌మైన శృంగారంలో పాల్గొన‌డం, త‌ల్లి గ‌ర్భం నుంచి బిడ్డ‌కు వ్యాప్తి చెందే అవ‌కాశాలు ఉంటాయి.

can aids come with mosquito bite

దోమ కుట్ట‌డం వ‌ల్ల మ‌లేరియా, డెంగ్యూ లాంటి విష జ్వ‌రాలు వ‌స్తాయి కానీ ఎయిడ్స్ రాద‌ని, క‌నుక ఈ విష‌యంలో ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts