ప్రపంచ వ్యాప్తంగా అనేక మందికి భిన్న రకాల బ్లడ్ గ్రూప్‌లు ఉంటాయి. ఎ, బి, ఎబి, ఒ గ్రూప్‌లకు చెందిన రక్తాలు పాజిటివ్, నెగెటివ్ అని ఉంటాయి. అయితే ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ఒకటి ఉంది. అదే గోల్డెన్ బ్లడ్ గ్రూప్. ఇది ఎంత అరుదైంటే గతంలో ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు 50 మంది వరకు ఉండేవారు. కానీ ఇప్పుడు కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ రక్తం ఎంత ప్రత్యేకమైందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా మన రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాల ఉపరితలం మీద యాంటీజెన్‌లు అని పిలవబడే ప్రోటీన్లు ఉంటాయి. ఇవి Rh-positive లేదా Rh-negative ఉంటాయి. దాన్ని బట్టి ఎ పాజిటివ్ లేదా ఎ నెగెటివ్ అని వ్యవహరిస్తారు. ఇతర గ్రూప్‌లకు కూడా ఇదే వర్తిస్తుంది. అయితే గోల్డెన్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారి రక్తంలో ఎర్ర రక్త కణాల ఉపరితలం మీద Rh-positive లేదా Rh-negative యాంటీ జెన్‌లు ఏవీ ఉండవు. కనుక దాన్ని Rh null స్థితి అంటారు. అందువల్లే ఆ రక్తం ప్రత్యేకతను సంతరించుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా గోల్డెన్ బ్లడ్ టైప్ ఉన్నవారు గతంలో 50 మంది వరకు ఉన్నారని సమాచారం. కానీ ఇప్పుడు వారి సంఖ్య 9 కి చేరినట్లు తెలిసింది. ఈ క్రమంలో గోల్డెన్ బ్లడ్ టైప్ రక్తం ఎవరిలో అయినా ఉంటే ఎప్పుడైనా రక్తం కావల్సి వస్తే తీవ్రమైన సమస్య ఎదురవుతుంది. అలాంటి వారికి ఇబ్బందులు వస్తాయి. ఇక ఇతర బ్లడ్ గ్రూప్‌లలో కొన్ని బ్లడ్ గ్రూప్‌లు కేవలం కొంత మందిలోనే ఉంటాయి. వాటి కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ గోల్డెన్ బ్లడ్ టైప్ ఉంటే మాత్రం దొరకడం చాలా చాలా కష్టం అని చెప్పవచ్చు.