ఆధ్యాత్మికం

కర్పూరం, లవంగాలను తమలపాకులలో చుట్టి ఇలా చేస్తే ?

జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు స్థానం మారుతున్న సమయంలో మన రాశిని బట్టి అనేక సమస్యలు చుట్టుముడుతాయి. ఈ క్రమంలోనే ఎన్నో ప్రమాదాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ విధమైన సమస్యల నుంచి బయట పడటం కోసం కర్పూరం ఎంతో ఉపయోగపడుతుంది. కర్పూరంతో ఇలా చేస్తే మనం ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు తొలగిపోయి సుఖంగా ఉండవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

జాతకరీత్యా ఏవైనా దోషాలు ఉన్న సమయంలో కర్పూరం, లవంగాలను తమలపాకులో చుట్టి కాళీ మాతకు సమర్పించడం వల్ల దోషాలు తొలగిపోవడమే కాకుండా భయాందోళనలు కూడా తొలగిపోతాయి. అలాగే పెళ్లి ఆలస్యమవుతున్న యువతీ యువకులు కర్పూరం, పసుపు కలిపి దుర్గామాతకి పూజ చేయటం వల్ల దోషాలు తొలగిపోయి తొందరగా వివాహం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

wrap around camphor and cloves in betel leaves know what happens

ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కర్పూరం వెలిగించి ఆ మంటతో లవంగాలను కాల్చాలి. ఆ తరువాత కాల్చిన లవంగాలను నిద్రపోయే ముందు బయట పడేయటం వల్ల మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, ఆ తర్వాత సంపదకు ఏ మాత్రం లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. అలాగే ఇతరత సమస్యలతో బాధపడేవారు కర్పూరాన్ని వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. మన ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ వాతావరణం తొలగిపోయి పాజిటివ్ వాతావరణాన్ని ఏర్పడుతుంది. కనుకనే మనం ఇంట్లో పూజ అనంతరం కర్పూర హారతులను వెలిగిస్తాము.

Admin

Recent Posts