మాతృత్వం అనేది నిజంగా మహిళలకు ఒక గొప్ప వరం. పెళ్లయిన మహిళలు తల్లి కావాలని కలలు కంటారు. ఆ భాగ్యాన్ని దక్కించుకుంటారు. శిశువు కడుపులో పడగానే వారికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు, స్నేహితులు గర్భిణీలకు కావల్సిన పౌష్టికాహారాలను తెచ్చి పెడుతుంటారు. ఇక శిశువు జన్మించాక తల్లికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అయితే శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాళ్లతో తంతుంది. ఆ అనుభూతిని కేవలం గర్భిణీలు మాత్రమే పొందగలరు. మరి నిజానికి అసలు శిశువు అలా తల్లి కడుపులో ఉన్నప్పుడు కాళ్లతో ఎందుకు తంతుందో తెలుసా..? అదే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తల్లి గర్భంలో ఉన్న శిశువు తంతుంది అంటే.. ఆ శిశువు ఆరోగ్యంగా పెరుగుతున్నట్టు లెక్క. శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది అనడానికి సంకేతమే అది. కనుకనే శిశువు తంతుంది అంటే మనం ఆ శిశువు ఆరోగ్యంగా ఉందని తెలుసుకోవాలి. దీంతోపాటు బయటి వాతావరణానికి కూడా కడుపులో ఉండే శిశువులు స్పందిస్తారు. బయటి నుంచి ఏవైనా శబ్దాలను వింటే వారు తల్లి కడుపులో తంతారు. ఇక తల్లి ఎడమ వైపునకు పడుకున్నప్పుడు శిశువులు ఎక్కువగా తన్నుతారు. ఎందుకంటే ఆ వైపుకు తల్లి పడుకుంటే రక్త సరఫరా శిశువుకు బాగా జరుగుతుంది. దీంతో శిశువు యాక్టివ్ అయి తంతుంది.
తల్లి భోజనం చేసిన తరువాత కూడా శిశువులు గర్భంలో తంతారు. సాధారణంగా ఏ శిశువు అయినా 9 వారాల తరువాత తన్నడం మొదలవుతుంది. అది తల్లికి మొదటి సారి ప్రెగ్నెన్సీ వస్తే. రెండో సారి ప్రెగ్నెన్సీలో శిశువులు 13 వారాల తరువాత తంతారు. అయితే శిశువు తన్నడం లేదు.. అంటే.. శిశువు ఆరోగ్యంగా పెరగడం లేదని తెలుసుకోవాలి. ఈ క్రమంలో తగిన టెస్ట్‌లు చేయించుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. అయితే 36 వారాల తరువాత శిశువు తన్నడం కొద్దిగా తగ్గుతుంది. కానీ ఇలా జరగడం సహజమే. అందుకు భయ పడాల్సిన పనిలేదు. ఇవీ.. గర్భంలో ఉన్న శిశువులు తన్నడానికి గల కారణాలు..!