Kidney Damage : చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. కిడ్నీ సమస్యలు అసలు ఎందుకు వస్తాయి..?, ఎలాంటి పొరపాట్లు చేస్తే కిడ్నీ సమస్యలు వస్తాయి..? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మూత్రం కి వెళ్ళకుండా ఆపుకోవడం వలన కిడ్నీ సమస్యలు కలిగే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి యూరిన్ ని ఎప్పుడు ఆపుకోకూడదు. ఆహార పదార్థాలలో ఉప్పు ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. ఎక్కువ మందులు వేసుకోవడం వలన కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి.
మాంసాహారం ఎక్కువగా తినే వాళ్ళల్లో కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సిగరెట్లు, పొగాకు వంటివి తీసుకునే వాళ్ళల్లో కూడా కిడ్నీ సమస్యలు ఎక్కువగా మనం చూడొచ్చు. తరచూ ఇన్ఫెక్షన్లు బారిన పడడం వలన కిడ్నీలు పాడవుతాయి. సరిగ్గా నిద్ర లేక పోవడం వలన కూడా కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది.
మితిమీరి ఆహారాన్ని తినడం వలన కూడా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ నీళ్లు తాగినా, తక్కువ నీళ్లు తాగినా కూడా కిడ్నీలు పాడయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కూల్ డ్రింక్స్ ని ఎక్కువగా తాగితే కూడా కిడ్నీలు పాడవచ్చు. అదే విధంగా కొంత మంది కిడ్నీలో రాళ్లు ఉంటాయి. అటువంటి వాళ్ళు కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు.
గుమ్మడికాయ, పాలకూర, సపోటా, టమాట, పుట్టగొడుగులు, ఉసిరికాయ, దోసకాయ, వంకాయ, మటన్, చికెన్ ని అస్సలు తీసుకోవద్దు. కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్లు వీటిని అస్సలు తినకూడదు. కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్ళు అరటి పండ్లు, కొబ్బరి బొండం, బార్లీ బియ్యం, బాదం, క్యారెట్, కాకరకాయ, మొక్కజొన్నని డైట్ లో తీసుకోవచ్చు. నిమ్మకాయ, ఉలవలు, బత్తాయి, చేపలు, దానిమ్మ కూడా తీసుకోవచ్చు.