వైద్య విజ్ఞానం

రాత్రిపూట మీకు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మ‌ధుమేహం ఉన్నట్టే.. అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కండి..!

ఈ రోజుల్లో మ‌ధుమేహం ప్ర‌తి ఒక్కరిని వేధిస్తున్న స‌మ‌స్య‌.చిన్న వ‌య‌స్సులోనే డ‌యాబెటిస్ బారిన ప‌డి చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు.మధుమేహం వ్యాధికి చాలా లక్షణాలు కన్పిస్తుంటాయి. వీటిలో కొన్ని రాత్రి వేళ స్పష్టంగా బయటపడుతుంటాయి. మీక్కూడా ఈ లక్షణాలు క‌నిపిస్తే ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వైద్యుడిని సంప్ర‌దిస్తే మంచిది. మధుమేహం ప్రారంభదశలో ఉంటే కొంత ప‌రావ‌లేదు. కాని అదే పరిధి దాటితే ఇక జీవితమంతా మందులు వాడుతుండాలి. అయితే మ‌ధుమేహం ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయంటే.. కంటి చూపు తగ్గడం. హై బ్లడ్ షుగర్ ఉన్నప్పుడు కంట్లో ఉండే లెన్స్ దెబ్బతింటాయి. దాంతో చూపు మసకగా, అస్పష్టంగా కన్పిస్తుంది. రాత్రి వేళ ప్రత్యేకంగా మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఇలాంటి లక్షణం కన్పిస్తే వెంటనే అప్రమత్తం కావ‌డం మంచిది.

రాత్రి వేళ అదే పనిగా దాహం వేస్తుంటే మధుమేహం వ్యాధి కావచ్చు. రాత్రి వేళ కొంతమందికి తరచూ మూత్రం వస్తుంటుంది. నిద్రలోంచి లేవాల్సి వస్తుంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఇలా ఉండదు. కొంతమందికి ఎప్పుడైనా ఎక్కడైనా గాయమైతే త్వరగా మానదు. అలాంటి పరిస్థితి ఉంటే మధుమేహం ఉందని అర్ధం. మధుమేహంలో ఇదొక ప్రధానమైన లక్షణం. రాత్రుళ్లు తిమ్మిర్లు ఎక్కువగా రావడం అనేది షుగర్ ఉంటే కనిపించే మరో లక్షణం. షుగర్ లెవల్స్ పెరగడం వల్ల నరాలు దెబ్బతినడం వల్ల కాళ్ళ తిమ్మిర్లు వస్తాయి. దీని వల్ల నిద్ర సమస్యలు, నొప్పులు ఉంటాయి. అదే విధంగా, రాత్రుళ్లు ఎక్కువగా అలసట ఉన్నా కూడా షుగర్ పెరిగిందనుకోవచ్చు.

if you have these symptoms at night then it might be diabetes

బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగితే నిద్రలేమి పెరుగుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. శ్వాసలోపాలు ఉంటాయి. షుగర్ ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. రాత్రుళ్లు ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది. రాత్రుళ్లు ఎక్కువగా చెమటలు పట్టినా షుగర్ లెవల్స్ పెరిగినట్లే. రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చు తగ్గుల కారణంగా శరీర ఉష్ణోగ్రతని నియంత్రించడంలో ఇబ్బంది ఎదురై చెమటలు పడతాయి. ఇలా చెమట ఎక్కువగా పడుతుంటే షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవాలి. మధుమేహం అనేది దీర్ఘకాలిక ఆరోగ్యసమస్య. ఒక రకమైన జీవక్రియ రుగ్మత, ఇక్కడ శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. సరిగ్గా ఉపయోగించలేని ఫలితంగా, అదనపు రక్తంలో చక్కెర స్థాయిలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీని ప్రభావం మూత్రపిండాలు, చర్మం, గుండె, కళ్ళు తోపాటుగా మొత్తం ఆరోగ్యంపై పడుతుంది. మధుమేహం ఏ వయస్సులోనైనా రావచ్చు.

Sam

Recent Posts