ప్రస్తుతం బీపీ, షుగర్ లాగే థైరాయిడ్ సమస్య చాలా మందికి వస్తోంది. ఇందులో రెండు రకాలు ఉంటాయి. హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా విడుదల అవడం వల్ల మొదటి రకం థైరాయిడ్ వస్తుంది. ఇక థైరాయిడ్ హార్మోన్లు అవసరానికి మించి ఉత్పత్తి అయితే హైపర్ థైరాయిడిజం సమస్య వస్తుంది. రెండు రకాల థైరాయిడ్ సమస్యలలోనూ భిన్న రకాల లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే..
1. పనిచేయకపోయినా రోజూ మధ్యాహ్నం సమయంలో నీరసంగా ఉంటుందా ? అయితే దాన్ని థైరాయిడ్‌గా అనుమానించాల్సిందే. ఏ రకం థైరాయిడ్ ఉన్నా అందులో కామన్‌గా నీరసం కనిపిస్తుంటుంది.
2. థైరాయిడ్ ఉన్నవారిలో జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. గ్యాస్, మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యలు సడెన్‌గా వస్తుంటే దాన్ని థైరాయిడ్‌గా అనుమానించాలి.
3. థైరాయిడ్ గ్రంథి జీవక్రియలను నియంత్రిస్తుంది. అందువల్ల హైపో థైరాయిడిజం సమస్య ఉన్నవారు బరువు పెరుగుతారు. హైపర్ థైరాయిడిజం సమస్య ఉన్నవారు బరువు తగ్గుతారు. సడెన్‌గా బరువు తగ్గినా, పెరిగినా దాన్ని థైరాయిడ్‌గా అనుమానించాలి. థైరాయిడ్ ఉన్నవారిలో మెటబాలిజం గాడి తప్పుతుంది. అందువల్ల బరువు సడెన్‌గా పెరగడమో, తగ్గడమో జరుగుతుంది.
4. సోయా, క్యాబేజీ వంటి పదార్థాలు థైరాయిడ్ పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. ఆయా ఆహారాలను తిన్నప్పుడు మీకు శ్వాసకోశ సమస్యలు వస్తే దాన్ని థైరాయిడ్‌గా అనుమానించాలి.
5. థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో డిప్రెషన్ వస్తుంది. తరచూ మూడ్ అవుట్ అయినట్లు కనిపిస్తుంటారు. ఈ లక్షణం కనిపిస్తే థైరాయిడ్ ఉందేమో చెక్ చేయించుకోవాలి. ఉంటే అందుకు అనుగుణంగా మందులను వాడాలి.
6. థైరాయిడ్ గ్రంథి పెరగడాన్ని గాయిటర్ అంటారు. ఎటువంటి చికిత్స తీసుకోకపోతే థైరాయిడ్ గ్రంథి బాగా పెరుగుతుంది. దీంతో గొంతు దగ్గర స్పష్టంగా వాపు కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే థైరాయిడ్ సమస్య తీవ్రంగా ఉన్నట్లు లెక్క. కనుక అలాంటి పరిస్థితిలో కచ్చితంగా స్పందించి చికిత్సను తీసుకోవాలి.
7. ఉద్వేగ భరితమైన సంఘటనలు ఏమీ లేకపోయినా హార్ట్ బీట్ పెరిగిపోతుంటే దాన్ని థైరాయిడ్‌గా అనుమానించాలి.
8. థైరాయిడ్ ఉన్నవారిలో ఆకలి సరిగ్గా ఉండదు. ఇది ఆరంభంలో కనిపించే లక్షణం.
కనుక ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే దాన్ని థైరాయిడ్‌గా అనుమానించాలి. వెంటనే పరీక్షలు చేయించుకుని డాక్టర్ ఇచ్చే మందులను వాడాలి. దీంతో ఆ సమస్యను తగ్గించుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365