వైద్య విజ్ఞానం

మీ నోట్లో ఇలా ఉందా.. అయితే జాగ్ర‌త్త‌.. ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌ల‌వండి..

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం చాలా మంది క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నారు. క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి చాప కింద నీరులా విస్త‌రిస్తోంది. మ‌న శ‌రీరంలో అనేక భాగాల‌కు క్యాన్స‌ర్ వ‌స్తుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది క్యాన్స‌ర్‌తో చ‌నిపోతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప్రాణాంత‌క వ్యాధుల్లో క్యాన్స‌ర్ ఒక‌టిగా మారింది. రోజూ ఎంతో మంది ఎన్నో ర‌కాల క్యాన్స‌ర్‌ల బారిన ప‌డి ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారుగా ఏడాది 3 ల‌క్ష‌ల‌కు పైగా నోటి క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చేప‌ట్టిన స‌ర్వేల్లో వెల్ల‌డైంది. అంటే దీన్ని బ‌ట్టి చూస్తే క్యాన్స‌ర్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో మనం ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్యాన్స‌ర్ బాధితుల్లో నోటి క్యాన్సర్ బాధితులు 2 శాతం వ‌ర‌కు ఉంటార‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. అయితే మ‌నం చేసే చిన్న చిన్న పొర‌పాట్లే మ‌న‌కు నోటి క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని వైద్యులు సైతం చెబుతున్నారు. అయితే అస‌లు నోటి క్యాన్స‌ర్ ఎలా వ‌స్తుంది ? దీని ల‌క్ష‌ణాలు ఏ విధంగా ఉంటాయి ? ఎలా గుర్తించాలి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

if you have these symptoms then it might be oran cancer

నోటి క్యాన్స‌ర్ వ‌స్తే దంతాలు లూజ్‌గా అనిపిస్తుంటాయి. నోట్లో ఎర్ర‌ని లేదా తెల్ల‌ని ప్యాచ్‌లు ఏర్ప‌డుతాయి. నోట్లో పూత‌, భోజ‌నం మింగ‌డం, న‌మ‌ల‌డంలో నొప్పి ఉంటుంది. చెవి నొప్పి ఉంటుంది. నోట్లో గ‌డ్డ‌లు వ‌స్తే కూడా ఈ వ్యాధి ఉంద‌ని గుర్తించాలి. నోట్లో వాపులు రావ‌డం వంటివి క్యాన్స‌ర్‌కు ల‌క్ష‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. నోటి క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ముఖ్యంగా రేడియేష‌న్ కార‌ణ‌మ‌వుతుంది. అలాగే ప‌ర్యావ‌ర‌ణ కార‌కాలు, ఆల్క‌హాల్‌లోని కెమిక‌ల్స్‌, గుట్కాలు లేదా పొగాకు న‌మ‌ల‌డం, పొగ తాగ‌డం వంటివి నోటి క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు కార‌ణం అవుతాయి. క‌నుక ఎవ‌రిలో అయినా నోటి క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌ల‌వాలి. దీంతో ప్రాణాల‌ను కాపాడుకున్న వారు అవుతారు.

Admin

Recent Posts