Heart : మన శరీరంలో అతి ముఖ్యమైన మరియు నిరంతరం పని చేసే అవయవాల్లో గుండె ఒకటి. గుండె ఆరోగ్యంగా నిరంతరం పని చేస్తూ ఉంటేనే మనం జీవించి ఉండగలుగుతాం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది హార్ట్ ఎటాక్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. చక్కటి ఆహారాన్ని తీసుకునే వారు, చెడు అలవాట్లు ఏవి లేని వారు, అలాగే చక్కటి జీవన విధానాన్ని పాటించే వారు, ప్రతిరోజూ వ్యాయామం చేసే వారు కూడా హార్ట్ ఎటాక్ తో ప్రాణాలను కోల్పోతున్నారు. చాలా మంది హార్ట్ ఎటాక్ సడన్ గా ఉన్నటుండి వచ్చింది అని చెబుతూ ఉంటారు. కానీ హార్ట్ ఎటాక్ రావడానికి కొన్ని నెలల ముందే మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
కానీ చాలా మంది వీటిని గుర్తించక హార్ట్ ఎటాక్ బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ లక్షణాలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం వల్ల మనం హార్ట్ ఎటాక్ బారిన పడకుండా మన ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు. హార్ట్ ఎటాక్ రావడానికి ముందు మనలో కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మెడ మరియు భుజాల దగ్గర ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటుంది. సాధారణంగా ఒకే స్థితిలో ఎక్కువ సేపు కూర్చున్న, నిద్రపోయిన మెడ నొప్పులు రావడం సహజం. కానీ ఎటువంటి సమస్య లేకపోయినా తరచూ మెడ, భూజాల నొప్పి వస్తూ ఉంటే మాత్రం జాగ్రత్తగా పడాలి. మెడ, భుజాల నొప్పులు తరచూ వస్తూ ఉంటే గుండె ఆరోగ్యం దెబ్బతిన్నదిగా భావించాలి. మనం పరిగెత్తినప్పుడు, నడుస్తున్నప్పుడు మెడ మరియు భుజాల నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాగే గుండె సమస్యల వల్ల వచ్చే భుజాల నొప్పి రెండు భుజాలల్లో రాదు.
ఎక్కువగా ఎడమ వైపు ఉండే భుజంలో వస్తుంది. కనుక మెడ, భుజాల నొప్పి దీర్ఘకాలంగా వేధిస్తూ ఉంటే వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరం. అలాగే గుండె బలహీనపడడం వల్ల చేతులు మరియు కాళ్లు వెంటనే చల్లబడుతూ ఉంటాయి. గుండె బలహీనపడడం వల్ల చేతులకు, కాళ్లకు రక్తసరఫరా సాఫీగా సాగదు. దీంతో కాళ్లు, చేతులు ఎక్కువగా చల్లబడతాయి. అదే విధంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారిలో ఏ పని చేయకపోయినా ఎక్కువగా చెమటలు పడుతూ ఉంటాయి. చలికాలంలో రాత్రి పూట కూడా చెమటలు పడుతూ ఉంటే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అలాగే పురుషుల్లో నపుంసకత్వం వంటి సమస్యలు తలెత్తిన్నా కూడా గుండె ఆరోగ్యం దెబ్బతిన్నదిగా భావించాలి.
ధమనుల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల వెన్నముక కింది భాగంలో రక్తసరఫరా, ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీంతో లైంగిక సామర్థ్యం తగ్గడం, నపుంసకత్వం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే గుండె సమస్యలు ఉన్న వారిలో శ్వాస కూడా సరిగ్గా ఆడదు. వారు శ్వాస తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడతారు. ఆయాసం ఎక్కువగా వస్తుంది. ఈ లక్షణాన్ని గుర్తించిన వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. అలాగే నీరసం, బలహీనత వంటి సమస్యలతో దీర్ఘకాలం పాటు ఇబ్బందిపడుతూ ఉంటే దీనిని కూడా గుండె బలహీనత లక్షణంగా భావించాలి. ఎటువంటి పని చేయకపోయినప్పటికి నీరసంగా, నిస్సత్తువుగా, బలహీనంగా ఉన్నట్టు భావిస్తే గుండె సమస్య ఉన్నట్టుగా భావించాలి.
అలాగే వికారం, కళ్లు తిరిగినట్టుగా, చుట్టూ తిరిగినట్టుగా ఉంటే కూడా గుండె సమస్యగా భావించాలి. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ఎక్కువగా ఈ భావన కలుగుతుంది. అలాగే గుండె సమస్యల కారణంగా ఛాతిలో నొప్పి ఎక్కువగా వస్తుంది. ఇతర కారణాల వల్ల ఛాతిలో నొప్పి వచ్చినప్పటికి గుండె సమస్యల కారణంగా వచ్చే నొప్పి కొద్దిగా వేరుగా ఉంటుంది. ఎడమ భుజం, ఛాతి, ఎడమ వైపు దవడ , వెన్ను భాగాల్లో నొప్పి ఎక్కువగా ఉంటే గుండె సమస్యగా భావించాలి. పైన చెప్పిన లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.