వైద్య విజ్ఞానం

నాలుక తెల్లగా ఉందా..? అయితే ఈ అనారోగ్యాలే కారణాలు కావచ్చు..!

శరీరం అన్నాక మనం తరచూ అనారోగ్యాలకు గురవుతూనే ఉంటాం. ఈ క్రమంలోనే సమస్యలు వచ్చినప్పుడల్లా మనకు మన శరీరం పలు లక్షణాలను చూపిస్తుంటుంది. ఇక ప్రధానంగా నాలుక విషయానికి వస్తే.. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేందుకు అప్పుడప్పుడు నాలుక మనకు ఒక్కో విధంగా కనిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే కొందరికి నాలుకపై ఎల్లప్పుడూ తెల్లగా కనిపిస్తుంటుంది. అయితే అలా ఎందుకు అవుతుంది ? ఏ అనారోగ్య సమస్యలు ఉన్నవారికి నాలుక అలా తెల్లగా కనిపిస్తుంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నాలుకపై అంతా తెల్లగా కనిపిస్తుందంటే.. ఆయుర్వేద ప్రకారం.. అది కఫం లేదా ఆమం అయి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే చిన్నపేగుల్లో విష పదార్థాలు పేరుకుపోతాయి. దీంతో ఆ సమస్యకు సూచనగా నాలుకపై అంతా తెల్లగా అవుతుంది. అయితే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చూసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతో నాలుక యథాతథ స్థితికి మారుతుంది.

if your tongue is white then these may be the reasons

ఇక కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తినే వారి నాలుక కూడా ఇలాగే తెల్లగా అవుతుంటుంది. అలాంటి వారు ఆయా ఆహారాలను తినడం మానేయాలి. దీంతో నాలుక తెల్లగా కాకుండా చూసుకోవచ్చు. అలాగే పొగతాడం, మద్యం సేవించడం, దంత సమస్యలు ఉన్నవారి నాలుక కూడా తెల్లగా కనిపిస్తుంది. ఆయా సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా నాలుక మామూలు స్థితిలోకి మారేలా చేయవచ్చు.

డయాబెటిస్‌ ఉన్నవారు, యాంటీ బయోటిక్స్‌ను తరచూ వాడే వారు, శరీర రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, విటమిన్‌ బి, ఐరన్‌ లోపం ఉన్నవారి నాలుక కూడా తెల్లగా అవుతుంది. అయితే పోషకాహారం సరిగ్గా తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇక సిఫిలిస్‌ ఉన్నవారు, ఓరల్‌ క్యాన్సర్‌ ఉన్నవారి నాలుక కూడా తెల్లగా కనిపిస్తుంది. ఇలాంటి వారు వైద్య సహాయం పొందాలి. దీంతో నాలుకను తిరిగి యథాతథ స్థితికి రప్పించేందుకు అవకాశం ఉంటుంది.

Admin

Recent Posts