కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

మన శ‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌యవాల్లో కిడ్నీలు కూడా ఒక‌టి. ఇవి నిరంత‌రం ప‌నిచేస్తూనే ఉంటాయి. మ‌నం తినే ఆహార ప‌దార్థాలు, తాగే ద్ర‌వాల్లో ఉండే వ్య‌ర్థాల‌ను ఫిల్ట‌ర్ చేసి బ‌య‌టకు పంపుతాయి. అందువ‌ల్ల కిడ్నీలు చాలా ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తాయని చెప్ప‌వ‌చ్చు. అయితే కొంద‌రిలో ప‌లు కార‌ణాల వ‌ల్ల కిడ్నీలు స‌రిగ్గా ప‌నిచేయ‌వు. దీంతో వారిలో కిడ్నీల్లో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. దీంతో కొంత కాలానికి కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. కానీ కిడ్నీలు స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డం ప్రారంభ‌మైన‌ప్పుడే మ‌న శ‌రీరంలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని ప‌రిశీలించ‌డం ద్వారా కిడ్నీలు ఫెయిల్ కాకుండా చూసుకోవ‌చ్చు. మ‌రి ఆ ల‌క్ష‌ణాలు ఏమిటంటే…

kidney problems symptoms

1. సాధార‌ణంగా ఎవ‌రైనా స‌రే శ్ర‌మ ఎక్కువ‌గా చేస్తే అల‌సిపోతుంటారు. శార‌రీక‌, మాన‌సిక శ్ర‌మ.. ఏదైనా స‌రే అల‌స‌ట స‌హ‌జంగా వ‌స్తుంది. కానీ కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ప‌నిచేయ‌క‌పోయినా తీవ్రంగా అల‌సిపోతుంటారు. లేదా చిన్న‌పాటి ప‌నికే ఎక్కువ అల‌స‌ట‌, నీర‌సం వ‌స్తాయి.

2. కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు చ‌లిని అస‌లు త‌ట్టుకోలేరు. ఎందుకంటే వారిలో హిమోగ్లోబిన్ స్థాయిలు త‌క్కువ‌గా ఉంటాయి. దీంతో అల‌స‌ట వ‌చ్చి చ‌లిని త‌ట్టుకోలేరు.

3. కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి శ్వాస తీస‌కోవ‌డం క‌ష్టంగా ఉంటుంది. మెట్లు ఎక్కినా, కొంత సేపు వాకింగ్ చేసినా శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది.

4. కిడ్నీలు స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. దీంతో చ‌ర్మంపై ద‌ద్దుర్లు, దుర‌ద‌లు వ‌స్తుంటాయి.

5. కిడ్నీల్లో స‌మ‌స్య‌లు ఉంటే మూత్రంలో ప్రోటీన్ వ‌స్తుంది. దీంతో మూత్రంలో నురుగు, బుడ‌గ‌లు క‌నిపిస్తాయి. అలాగే పొట్ట ఉబ్బిపోయి క‌నిపిస్తుంది.

6. కిడ్నీ స‌మ‌స్య‌లు ఉంటే వికారంగా ఉంటుంది. వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. ఆక‌లి త‌క్కువ‌గా ఉంటుంది. విరేచ‌నాలు అవుతాయి.

పైన తెలిపిన ల‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా ఉంటే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో చెక్ చేయించుకోవాలి. స‌మ‌స్య ఉంటే డాక్ట‌ర్ సూచించిన విధంగా మందుల‌ను వాడ‌డంతోపాటు పోష‌కాహారం తీసుకోవాలి. దీంతో కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అవ‌కుండా ఉంటాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts