Liver : మన శరీరంలో అంతర్గతంగా ఉండే ముఖ్యమైన అవయవాల్లో లివర్ ఒకటి. ఇది అనేక విధులను నిర్వర్తిస్తుంది. శరరీంలో కొవ్వును కరిగిస్తుంది. అవసరం అయినప్పుడు కొవ్వును నిల్వ చేస్తుంది. లివర్ రోజూ రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరానికి అందిస్తుంది. శరీరానికి శక్తిని కూడా అందజేస్తుంది. అయితే లివర్ చెడిపోతే మన శరీరంలో కొన్ని లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. లివర్ చెడిపోయిన వారు ఉన్నట్లుండి సడెన్‌గా బరువు తగ్గుతారు. అకస్మాత్తుగా బరువు తగ్గుతున్నారంటే.. లివర్ డ్యామేజ్ అయిందని అర్థం చేసుకోవాలి. వెంటనే అలర్ట్ అవ్వాలి.
2. లివర్ సరిగ్గా పనిచేయకపోయినా, కామెర్లు వచ్చినా లేక లివర్ చెడిపోయినా.. మన శరీరం పసుపు రంగులోకి మారుతుంది. కళ్లు, చర్మం పసుపు రంగులో కనిపిస్తాయి. ఈ సూచనలు కనిపిస్తుంటే కచ్చితంగా లివర్ చెడిపోయిందని తెలుసుకోవాలి.
3. లివర్ చెడిపోయిన వారికి కుడి ఊపిరితిత్తి కింది భాగంలో లేదా జీర్ణాశయం పై భాగంలో నొప్పిగా ఉంటుంది.
4. లివర్ సరిగ్గా పనిచేయకపోయినా.. లివర్ చెడిపోయినా.. తీవ్రమైన అలసట వస్తుంది. చిన్న పనిచేసినా విపరీతంగా అలసిపోతారు. శరీరంలో శక్తి లేనట్లు అనిపిస్తుంది.
పైన తెలిపిన లక్షణాలు శరీరంలో కనిపిస్తే చాలు.. వెంటనే అలర్ట్ అవ్వాలి. డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉందని తేలితే.. డాక్టర్‌చే చికిత్స తీసుకోవాలి. దీంతో లివర్ పూర్తిగా చెడిపోకుండా జాగ్రత్త పడవచ్చు. ప్రాణాపాయం రాకుండా ఉంటుంది.