Skin Cancer Symptoms : క్యాన్సర్లు అనేక రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. శరీరంలో ఏ భాగానికైనా క్యాన్సర్ సోకవచ్చు. దీంతో పలు లక్షణాలు కనిపిస్తాయి. దాదాపుగా అన్ని రకాల క్యాన్సర్లకు ఒకే రకమైన లక్షణాలు కనిపిస్తాయి. కానీ కొన్ని క్యాన్సర్లకు కొన్ని లక్షణలు వేరేగా ఉంటాయి. ఈ క్రమంలోనే చర్మ క్యాన్సర్ వస్తే దాన్ని ముందుగానే ఎలా గుర్తించవచ్చో, దానికి లక్షణాలు ఏమి కనిపిస్తాయో.. ఇప్పుడు తెలుసుకుందాం. చర్మం మీద పులిరి లేదా ఎండిపోయిన పొలుసు లాంటి అతుకులు ఒకటి రెండు నెలల కన్నా ఎక్కువ రోజుల పాటు ఉంటే దాన్ని చర్మ క్యాన్సర్‌గా అనుమానించాలి.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను కలవాలి. వాస్తవానికి పులిపిరిలా కనిపించేది నిజానికి పొలుసుతో ఉన్న కణాల క్యాన్సర్‌కు సంకేతం అయి ఉంటుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్త పాటించాలి. అలాగే ఎండిపోయిన పొలుసు లాంటి అతుకులు కనిపిస్తున్నాయంటే అది కూడా క్యాన్సర్ కావచ్చు. అదేవిధంగా యాక్టినిక్ కెరాటోసెస్ అనే క్యాన్సర్‌కు ముందు లక్షణంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఎలాంటి చర్మ క్యాన్సర్‌నైనా సరే తొలిదశలోనే నిర్ధారణ చేసుకొని, తగిన చికిత్స తీసుకోవాలి. అలా చేస్తేనే దాని వ్యాప్తిని అరికట్టగలం. దీంతో ప్రాణాంతకం కాకుండా ఉంటుంది.
తొలిదశలో గుర్తించడం వల్ల చిన్న క్యాన్సర్లకు సర్జరీ చేయడం తక్కువ ప్రయాసతో, సంక్లిష్టం కాకుండా ఉంటుంది. అయితే ప్రీక్యాన్సర్లను క్రీములు, లిక్విడ్ నైట్రోజెన్, ఫొటో డైనమిక్ థెరపీని ఉపయోగించి అవి క్యాన్సర్లుగా పరిణమించకుండా నివారించవచ్చు. దీంతో క్యాన్సర్ ముదరకుండా చూసుకోవచ్చు. అయితే గోరు కింద నల్లటిమచ్చలు, రక్తం స్రవించే కురుపు లేదా ఎంతకూ తగ్గని కురుపు (సోర్), అరచేతులు, పాదాల మీద కనిపించే గోధుమ రంగు మచ్చలు లాంటివాటిని క్యాన్సర్‌కు సంకేతాలుగా భావించకూడదు. వాటిని పట్టించుకోక పోయినా ఏమీ కాదు. కానీ అంతగా అనుమానం ఉంటే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవచ్చు. దీంతో క్యాన్సర్ ఉన్నదీ లేనిదీ నిర్దారణ అవుతుంది. దీంతో ముందుగానే గుర్తించి జాగ్రత్త పడిన వారము అవుతాము.