Lemon Grass Tea : హార్ట్ ఎటాక్ రాకుండా చేసే టీ ఇది.. ఎలా త‌యారు చేయాలంటే..?

Lemon Grass Tea : మ‌న‌కు తాగేందుకు అనేక ర‌కాల టీలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చాలా వ‌ర‌కు అన్ని టీలు కూడా ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌నే అందిస్తాయి. ఇక అలాంటి టీల‌లో లెమ‌న్ గ్రాస్ టీ కూడా ఒక‌టి. దీన్నే నిమ్మ గ‌డ్డి అని కూడా అంటారు. వాస్త‌వానికి నిమ్మ‌కాయ‌ల‌కు, నిమ్మ‌చెట్ల‌కు, నిమ్మ గ‌డ్డికి సంబంధం లేదు. కానీ నిమ్మ‌గ‌డ్డి అచ్చం నిమ్మ‌కాయ‌ల‌ను పోలిన వాస‌న వ‌స్తుంది. పైగా గ‌డ్డి మాదిరిగా ఉంటుంది. అందుక‌ని దానికి నిమ్మ‌గ‌డ్డి అని పేరు వ‌చ్చింది. దీన్నే లెమ‌న్ గ్రాస్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ టీని తాగడం వ‌ల్ల మ‌నం ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ టీని ఎలా త‌యారు చేయాలి.. దీంతో ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

లెమ‌న్ గ్రాస్ టీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నీళ్లు – 4 క‌ప్పులు, లెమ‌న్ గ్రాస్ – 3 కాడ‌లు (ప‌చ్చివి), తేనె – 3 టీస్పూన్లు (బెల్లం కూడా వేసుకోవ‌చ్చు).

Lemon Grass Tea many wonderful health benefits how to make it
Lemon Grass Tea

లెమ‌న్ గ్రాస్ టీని తయారు చేసే విధానం..

ముందుగా గిన్నెలో నీళ్లు పోసి స్ట‌వ్‌ మీద ఉంచి బాగా మరిగించుకోవాలి. అందులో నిమ్మగడ్డి వేసి మరో 10 నిమిషాలు మరిగించి, ఆవిరి బయటికి రాకుండా మూతపెట్టేయాలి. కప్పులో తేనె వేసుకొని, ముందుగా మ‌రిగించుకున్న నీటిని అందులోకి వడకట్టుకోవాలి. చక్కటి పరిమళంతో పసందైన నిమ్మగడ్డి టీ రెడీ అవుతుంది. దీన్ని అలాగే గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగ‌వ‌చ్చు. తేనె వ‌ద్ద‌నుకునేవారు బెల్లం క‌లుపుకుని తాగ‌వ‌చ్చు. ఈ టీని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. లెమ‌న్ గ్రాస్ టీలో సిట్ర‌ల్ జెరేనియ‌ల్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది గుండె జ‌బ్బులు రాకుండా చూస్తుంది. హార్ట్ ఎటాక్ రాకుండా ర‌క్షిస్తుంది. లెమ‌న్ గ్రాస్ టీ యాంటీ క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది. దీన్ని తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల ఆగిపోతుంది. దీంతో క్యాన్స‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

లెమ‌న్ గ్రాస్ టీ తాగితే పొట్ట‌లో అల్స‌ర్లు త‌గ్గిపోతాయి. బీపీ త‌గ్గుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ అదుపులోకి వ‌స్తాయి. జీవ‌క్రియ‌లు నియంత్రించ‌బ‌డ‌తాయి. దీంతో శ‌రీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. లెమ‌న్ గ్రాస్ టీని మ‌హిళ‌లు తాగితే నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే నొప్పులు, అధిక ర‌క్త‌స్రావం వంటి స‌మస్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. లెమ‌న్ గ్రాస్ టీ మంచిదే అయిన‌ప్ప‌టికీ దీన్ని రోజుకు ఒక క‌ప్పు మించ‌కూడ‌దు. ఎక్కువ‌గా ఈ టీని తాగితే త‌ల‌తిర‌గ‌డం, ఆక‌లి పెర‌గ‌డం, నోరు పొడిబారిపోవ‌డం, త‌ర‌చూ మూత్ర విస‌ర్జ‌న చేయాల్సి రావ‌డం, అల‌స‌ట‌, ద‌ద్దుర్లు, దుర‌ద‌, శ్వాస ఆడ‌క‌పోవ‌డం, గుండె వేగంగా కొట్టుకోవ‌డం, అల‌ర్జీలు వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. ఇక గ‌ర్భిణీలు, లో బీపీ ఉన్న‌వారు లెమ‌న్ గ్రాస్ టీని తాగ‌కూడదు.

Editor

Recent Posts