వైద్య విజ్ఞానం

వ‌డ‌దెబ్బ తాకితే ఏం చేయాలి..? దాని ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి..?

వడదెబ్బ లేదా ఎండదెబ్బ… ఏదైనా ఒకటే. మానవ శరీరం 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకుంటుందట. 32 డిగ్రీలు దాటినప్పుడే వడదెబ్బ తాకే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా చలికాలం, వర్షాకాలంలో వచ్చే ఎండలు 32 డిగ్రీలు దాటే అవకాశం ఉండదు కాబట్టి ఆ కాలాల్లో వడదెబ్బ తాకే ప్రమాదం ఉండదు. ఎండాకాలంలో మాత్రం ఎండ 50 డిగ్రీల వరకు పెరుగుతుంది. అదే చాలా డేంజర్. ఎండలో తిరగ‌డం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత 35 డిగ్రీలు చేరుకుంటుంది. దీంతో మనిషికి వడదెబ్బ తాకుతుంది. ఒకవేళ శరీరంలోని ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటితే అది ప్రాణాంతకం. అధిక ఉష్ణోగ్రతకు గురైన వ్యక్తి ఐదు రోజుల్లో చనిపోతాడట. అయితే.. వడదెబ్బ ఎక్కువగా పిల్లలకు, 60 ఏళ్లు పైబడిన వాళ్లకు త్వరగా తాకుతుంది.

వడదెబ్బ లక్షణాలేంటి?

వడదెబ్బకు గురైన వారి బాడీ డీహైడ్రేట్ అవుతుంది. శరీరంలో నీటి శాతం ఒక్కసారిగా తగ్గిపోతుంది. బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది. అది శరీరంలోని వివిధ అవయవాల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. బాడీలోని లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో మనిషికి నీరసం వచ్చేస్తుంది. వెంటనే జ్వరం రావడం, వాంతులు అవడం, విరేచనాలు కూడా అయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ఆ వ్యక్తి పల్స్ పడిపోయి తల తిరగడం… ఒక్కోసారి వడదెబ్బ తాకిన వ్యక్తి మూర్చపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

sun stroke symptoms and what to do with it

ఎవరికైనా వడదెబ్బ తాకితే ఏం చేయాలి..?

వడదెబ్బ తాకిన వ్యక్తిని వెంటనే దగ్గర్లో ఉన్న నీడ ప్రదేశానికి తీసుకెళ్లాలి. ఆ వ్యక్తి బట్టలను కొంచెం వదులు చేసి అతడి శరీరాన్ని నీటితో తడపాలి. ఆ నీళ్లు కూడా 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉండాలి. దీని వల్ల చర్మం కింద ఉండే రక్తనాళాలు కుంచించుకుపోవు. ఎలాగైనా అతడి శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గేలా చేయాలి. వీలైతే ఐస్ ప్యాక్‌లను పెట్టాలి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తే వడదెబ్బ తాకిన వ్యక్తిని ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు.

Admin

Recent Posts