వైద్య విజ్ఞానం

థైరాయిడ్ సమస్యను తెలిపే 9 సాధారణ లక్షణాలు..!

మీకు తెలుసా.. ఏదైనా వ్యాది మనల్ని అటాక్ చేయడానికి ముందు మన శరీరం మనకు సిగ్నల్స్ ఇస్తుంది.. చిన్న చిన్న సమస్యలే కదా అని లైట్ తీసుకుంటే అవి పెద్దగా పరిణ‌మించే అవకాశాలుంటాయి. పదేళ్ల క్రితం థైరాయిడ్ సమస్య వల్ల మూడు శాతం మంది సఫర్ అయ్యేవారు. కానీ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలిన విషయం ఏంటంటే ప్రతి ఏటా పన్నెండు మిలియన్ల మహిళలు థైరాయిడ్ బారిన పడ్తున్నారని తేలింది. కాబట్టి మన బాడీ ఇచ్చే సంకేతాలను బట్టి ముందుగానే సమస్యను గుర్తిస్తే కొంతవరకైనా సేఫ్ గా బయటపడే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ అటాక్ చేస్తుందని సూచించే తొమ్మిది సంకేతాలేంటో తెలుసుకోండి.

నెమ్మదించిన జీవక్రియ వలన మీ శరీరం చెమటపట్టకుండా ఉండి చర్మం పొడిబారడం, దురద పుట్టడం లాంటి లక్షణాలు కనపడ‌తాయి. దాంతో పాటు ఎక్కువ సంఖ్యలో మీ జుట్టు రాలడం కూడా థైరాయిడ్ సంకేతంగా భావించవచ్చు. థైరాయిడ్ మన సెక్సువల్ లైఫ్ పై ప్రభావం చూపిస్తుంది.దీనివల్ల మీకు సెక్సువల్ లైఫ్ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కాబట్టి మీరు సెక్స్ పట్ల ఇంతకు ముందులా యాక్టివ్ గా ఉన్నారా లేదా గమనించుకోండి. మీరు బరువు పెరగడానికి మీ ఆహార‌ పద్దతి ఒక కారణం అయితే ఎటువంటి కారణం లేకుండా మీరు బరువు పెరిగినా, ఆకలి బాగా ఉండి ఎంత తింటున్నా బరువు తగ్గుతున్నా కూడా ధైరాయిడ్ లక్షణమే.

these symptoms indicate that it will be a thyroid problem

థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయ్యే పరిమాణంపైనే మీ మూడ్ కూడా ఆధారపడి ఉంటుంది. అకారణంగా ఎవరిపైన అయినా కోపం వస్తున్నా.. అలసటగా ఫీల్ అవ్వడం, డిప్రెషన్ కు గురికావడం, థైరాయిడ్ సింప్టమ్సే అని చెప్ప‌వ‌చ్చు. కాళ్లు, చేతులు వణకడం, ఎక్కువగా తిమ్మిరులు రావడం, అరికాళ్లు, అరిచేతులు ఎక్కువగా చెమట పట్టడం అనేది థైరాయిడ్ హార్మోన్ ప్రభావం వలనే కలుగుతుంది. హైపో థైరాయిడిజం ముఖ్య లక్షణం జీర్ణక్రియ అస్తవ్యస్తంగా మారడం. తత్ఫలితంగా మలబద్దకం సమస్య ఎదురవుతుంది.

అంతకుముందు మీకు ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, మలబద్దకం లాంటివి లేకుండా ఉంటే ఈ సమస్యను థైరాయిడ్ సింప్టమ్ గా పరిగణించాలి. తరచుగా మీ హార్ట్ బీట్ ఎక్కువగా ఉన్నా, గుండెల్లో వణుకుగా అనిపించినా కూడా డాక్టర్ ను సంప్రందించాలి. హైపోథైరాయిడిజం వలన మీ కంటి చూపు మసకబారినట్టుగా ఉంటుంది, మీ మెదడు కూడా ఇంతకు ముందులా యాక్టివ్ గా ఉండకుండా బద్దకం ఆవహించినట్టుగా అన్పిస్తుంటుంది. రోజువారీ పనులలో కూడా యాక్టివ్ గా ఉండలేక ఎప్పుడూ నిద్ర వస్తున్న ఫీలింగ్ లో ఉండడం, బద్దకంగా ఉండడం కూడా థైరాయిడ్ లక్షణమే.

Admin

Recent Posts