Thyroid Symptoms : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో థైరాయిడ్ సమస్య ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మహిళలు ఎక్కువగా ఈవ్యాధితో ప్రభావితం అవుతున్నారు. శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేసే శక్తి థైరాయిడ్ హార్మోన్ కు ఉంది. సాధారణంగా ఏ వ్యాధి నుండైనా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ వ్యాధి గురించి అవగాహాన అవసరం. అప్పుడే ఆ వ్యాధిని నియంత్రించే మార్గం కనిపిస్తుంది. అదేవిధంగా థైరాయిడ్ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఆ వ్యాధి వచ్చిందని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో వచ్చిన మార్పులను గమనిస్తూ మన ఆరోగ్య పరిస్థిని అంచనా వేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో ప్రమాదకరంగా మారిన థైరాయిడ్ ను కూడ మనం ముందస్తు లక్షణాల ద్వారా కనిపెట్టవచ్చు. తీవ్రమైన అలసటతో బాధపడడం, బరువు పెరగడం, జుట్టు రాలడం, అధిక చెమట వంటి లక్షణాలు కనిపిస్తే అది థైరాయిడ్ గ్రంథి సమస్యల వల్ల హైపోథైరాయిడిజం వల్ల కావచ్చునని నిర్ధారించుకోవాలి. ఈ పరిస్థితి మహిళల్లో తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. దీనికి చికిత్స తీసుకోవడం చాలా అవపరం. సీతాకోక చిలు ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి శరీరంలోని ప్రతి కణానికి అవసరమయిన హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది.
అయితే అవి ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. థైరాయిడ్ హార్మోన్ తగ్గితే శరీర బరువు పెరుగుతారు. దీన్ని హైపో థైరాయిడిజం అంటారు. అలాగే థైరాయిడ్ హార్మోన్ పెరిగితే శరీర బరువు తగ్గుతారు. దీనిని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ వ్యాధికి సంబంధించిన బయటకు కనిపించే ప్రధాన లక్షణాల్లో మెడ ఉబ్బడం ఒకటి. థైరాయిడ్ గ్రంథిలో మార్పుల వల్ల ఈ లక్షణం కనిపిస్తుంది. థైరాయిడ్ సమస్య తలెత్తినప్పుడు శరీర ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపిస్తుంది. శరీర ఉష్ణోగ్రత ఒక్కసారి పెరగడమో, ఒక్కసారి తగ్గడమో జరుగుతుంది. ఎక్కువ చలిగానో ఎక్కువ వేడిగానో అనిపిస్తుంది.
పొడి చర్మం, పెలుసైన గోర్లు, చేతుల జలదరింపు, మలబద్దకం, అసాధారణ రుతుస్రావం వంటివి హైపో థైరాయిడ్ లక్షణాలు. కండరాల బలహీనతలు, చేతులు వణకడం, దృష్టి సమస్యలు, విరోచనాలు, క్రమ రహిత రుతుచక్రం వంటి హైపర్ థైరాయిడ్ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. హైపర్ థైరాయిడ్ విషయంలొ అజాగ్రత్తగా ఉంటే గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది. హైపో థైరాయిడ్ ఉన్న వారు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది.