వైద్య విజ్ఞానం

చలికాలంలో యూరిన్ ఎందుకు ఎక్కువగా వస్తుంది?

చలికాలం రాగానే అందరూ గజగజ వనికి పోతూ ఉంటారు. ఉదయం లేవడం కూడా చలికాలంలో కష్టతరం అవుతుంది. చలికాలం రాగానే అందరూ వెచ్చగా ఉండేందుకు చలిమంటలు కాస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే… చలికాలంలోనే మన శరీరం బాగా పగులుతుంది.

అంతేకాదండోయ్… చలికాలంలో కొంచెం ఎక్కువగా టాయిలెట్ కి వెళ్తాం. ఏం చేసినా సరే ఎక్కువగా యూరిన్ చేస్తాం. దీనికి కారణం మన శరీరంలో ఉన్న చిన్న చిన్న రక్తనాళాలు. ఇది లో టెంపరేచర్ ఉన్నప్పుడు చిన్నగా, బిగుతుగా అయిపోతాయి. ఇలాంటి సమయంలో మన శరీరంలో ముఖ్యమైన భాగాలకు రక్త సరఫరా తక్కువగా జరుగుతూ ఉంటుంది.

why we get urine mostly in winter

అందువల్ల వీటికి కొంచెం ఎక్కువ రక్తాన్ని పంపించాల్సి వస్తుంది. అందువల్ల కిడ్నీలు కొంచెం ఎక్కువ రక్తాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. కిడ్నీలు ఎక్కువగా పని చేయడం వలన మనకు యూరిన్ ఎక్కువగా వస్తుంది. అయితే చలికాలంలో… మనకు దాహం కానప్పటికీ… ఎక్కువగా నీళ్లు తాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన నీళ్లు తాగకపోతే అనేక సమస్యలు వచ్చే పరిస్థితులు ఉంటాయని వారు వెల్లడిస్తున్నారు. కాబట్టి చలికాలంలో సరిపడా నీళ్లు తాగడం బెటర్.

Admin

Recent Posts