mythology

శ్రీ అనే ప‌దానికి ఇంతటి మ‌హ‌త్తు ఉందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఓంకారం&comma; శ్రీకారం మంగళవాచకాలు&period; శ్రీకారంతో ప్రారంభించిన ఏ కార్యమైనా జయం పొందుతుంది&period; క్షేమం కలుగుతుంది&period; ఏ కార్యక్రమమైనా ప్రారంభించడాన్ని శ్రీకారం చుట్టారు అని అంటూ ఉంటాం&period; శ్రీ అనే శబ్దానికి లక్ష్మి మొదలైన అర్ధాలున్నాయి&period; అలాగే శ్రీని స్త్రీవాచకంగా గుర్తిస్తారు&period; సీతతో కూడిన రాముణ్ణి శ్రీరాముడు అనాలని కొందరు చెబుతారు&period; మంత్రసాధనలో కూడా శ్రీం బీజానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది&period; మొత్తంమీద శ్రీ అనేది గౌరవ పురస్పరంగా వాడే శబ్దంగా గుర్తించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే నిజానికి ఇది స్త్రీ శబ్దంగా వాడుతున్నాం కాని అది స్త్రీ&comma; పురుష శబ్దాలకు అతీతమైనది&period; సర్వజగత్తు దేనితో నడుస్తుందో&comma; ఏది తెలిస్తే మిగిలినవి ఏవి అవసరం లేదో అదే శ్రీ&period; శ్రీ శబ్దానికి శోభ&comma; శాంతి అని అర్థాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81202 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;srikrishna&period;jpg" alt&equals;"meaning of sri in hindu mythology " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆనందం&comma; తేజస్సు&comma; బ్రహ్మశక్తి కలయికనే శ్రీ&period; అంటే విశ్వంలో ఏది అంతిమమో&comma; ఏది అనాదియో అదే శ్రీ&period; దాని గురించి తెలుసుకునే విద్యనే శ్రీ విద్య అంటారు&period; శ్రీ విద్య అంటే అమ్మవారి ఉపాసకులు కూడా&period; అందరికీ ఆశ్రయాన్నిచ్చే శక్తి&comma;లేదా అందరూ అంటే త్రిమూర్తులకు సైతం ఆశ్రయమిచ్చే శక్తిని శ్రీ అని అంటారు&period; ప్రస్తుతం సాధారణంగా గౌరవవాచకంగా&comma; శుభప్రదమైనదిగా శ్రీ ఉపయోగిస్తున్నాం&period; ఇది ఒక బీజాక్షరం కూడా&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts