mythology

Ravana : రావణుడు చనిపోయే ముందు రాముడితో చెప్పిన మాటలు ఇవి..!

Ravana : రాముడు రావణుడిని వధించాడు. రావణుడు చనిపోయే ముందు, రాముడికి చెప్పిన మాటలు ఇవి. రావణుడు తాను చనిపోయే ముందు రాముడికి ఈ విధంగా చెప్పుకొచ్చాడు. లంకాధిపతి రావణ బ్రహ్మ యుద్ధ భూమిలో మృత్యు శయ్య‌పై అవసాన దశలో శ్రీరాముడితో ఈ విధంగా మాట్లాడాడు. రామా నీ కంటే నేను అన్నింట్లో కూడా గొప్పవాడినే. నాది బ్రాహ్మణ జాతి. నీది ఏమో క్షత్రియ జాతి. నీకంటే వయసులో కూడా నేను పెద్దవాడిని. నీ కుటుంబం కంటే నా కుటుంబం చాలా పెద్దది.

నా వైభవం కూడా నీ వైభవం కంటే అధికమైనది. నీ అంతఃపురం స్వర్ణమైతే, నా లంకా నగరం అంతా కూడా స్వర్ణమయమే. బల పరాక్రమాల్లో కూడా నీ కంటే నేను శ్రేష్టుడిని. అయితే నీతో నేను చూసుకుంటే.. నీ కంటే అన్నింటిలో కూడా నేను ముందు ఉన్నాను. అయినా కూడా యుద్ధంలో నీ ముందు నేను ఓడిపోయాను. నీవే యుద్ధం గెలిచావు. దీనికి కారణం ఒకే ఒక్కటి.

ravana told this to rama after his deathravana told this to rama after his death

అదేమిటి అంటే నీ తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు. కానీ నా తమ్ముడు మాత్రం నా వద్ద లేడు. నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఆ కారణం చేతే నేను ఓడిపోయాను.. అని రావ‌ణుడు తాను చ‌నిపోయే ముందు రాముడితో చెబుతాడు. దీన్ని బ‌ట్టి చూస్తే కుటుంబం దూరమైతే బతుకే భారం అయిపోతుంది. కుటుంబాన్ని విడిపోయి రావణుడు లాంటి వాడే ఓటమిపాలయ్యాడు. అలాంటిది రావణుడి ముందు మనమెంత..? అందుకే కలిసి ఉండాలి. క‌చ్చితంగా కలసి ఉండి విజయాన్ని అందుకోవాలి. కుటుంబాన్ని విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాలి.

కలిసి ఉంటే దేనినైనా సులభంగా సాధించచ్చు. ఎంతటి కష్టాన్నైనా మనం ఎదుర్కోవచ్చు. కలిసి ఉంటే ఒకరికొకరు తోడుగా ఉంటారు. కనుక దేనినైనా అధిగమించవచ్చు. అనవసరంగా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నలుగురితో ఉంటే దేనినైనా మనం దాటేయవచ్చు. ఓటమి కూడా ఎదురవ్వదు. గెలుపు మన సొంతమవుతుంది. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటే, విడిపోయి ఓటమిపాలవ్వరు. కలిసి గెలుస్తారు.

Admin

Recent Posts