Off Beat

ప్రేమకోసమై వలలో పడనే పాపం మధు…..బాల..?

ఇండియన్ ఫారిన్ సర్వీస్ సీనియర్ అధికారి మాధురీ గుప్తా వయస్సు 52 సంవత్సరాలు మరియు అవివాహితురాలు. ఈవిడ గారు ఈజిప్ట్, మలేషియా, జింబాబ్వే, ఇరాక్, లిబియాతో సహా అనేక దేశాల్లో ఉన్నత స్థానాల్లో పనిచేశారు. ఉర్దూ భాషపై ఆమెకు ఉన్న మంచి పట్టు కారణంగా, ఆమెను పాకిస్తాన్‌కు పంపారు, అక్కడ ఆమెకు మీడియా ఛార్జ్ కూడా ఇవ్వబడింది. ఒక పార్టీలో మాధురీ గుప్తాకి, జంషెడ్ అలియాస్ జిమ్మీ అనే 30 ఏళ్ల యువకుడు కలిశాడు. ఆ యువకుడు తన వాక్చాతుర్యం మరియు చమత్కారంతో మాధురీ గుప్తా హృదయాన్ని ఆకర్షించాడు. అలా మాధురి గుప్త ఆ యువకుడితో ప్రేమలో పడింది, అంతే కాదు, మాధురి ఇస్లాంను కూడా స్వీకరించింది అని భోగట్టా…..

అప్పుడు భారతదేశ ఇంటెలిజెన్స్ దృష్టి మాధురీ గుప్తాపై మరింత తీవ్రమైంది మరియు ఆమె ఇమెయిల్‌లు మరియు ఫోన్‌ మంతనాలపై నిఘా పెట్టారు. మాధురీ గుప్తా జంషెడ్ ప్రేమలో దేశ ద్రోహిగా మారి, జంషెడ్‌ ప్రేమలో అంధురాలై భారతదేశ రహస్య సమాచారాలన్ని కూడా అతనికి తెలియచేస్తూవుంది… 52 సంవత్సరాల వయస్సులో మాధురీ గుప్తా అవివాహిత అని ISI కి తెలియగానే, ఆమె ఖచ్చితంగా ప్రేమకోసం వెంపర్లాడుతూ, జీవిత భాగస్వామి కోసం తహతహ లాడుతూ ఉండవచ్చని, మాధురీ గుప్తాను ట్రాప్ చేయడానికి ISI సంస్థ జంషెడ్ అలియాస్ జిమ్మీ అనే 30 ఏళ్ల యువకుడికి శిక్షణ ఇచ్చి అతని ప్రేమలో చిక్కుకునే విధంగా పన్నాగం పన్ని, సఫలీకృతం అయింది ISI సంస్థ…..

woman story who go into a trap

ఏవో కారణాలతో మాధురీ గుప్తాను భారత దేశానికి పిలిపించిన ప్రభుత్వం…..ఆమె ఢిల్లీలో దిగగానే అరెస్ట్ చేసింది. ఆమె ప్రేమలో అంధురాలై ఆమె చేసిన దేశానికి ద్రోహం తలపెట్టిన సాక్ష్యాలను చూపెట్టినప్పుడు, ఆమె తన నేరాన్ని అంగీకరించింది…..అంత ఘోరమైన నేరాలకు, దయామయుల విభాగం అయినా కోర్ట్, అవివాహిత స్త్రీ అనే దృష్టికోణంలో ఆమెకు కేవలం అంటే కేవలం మూడు సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే విధించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో, ఆమె కొంతకాలం జైలు నుండి బెయిల్ పొంది, ఎవరికీ చెప్పకుండా అజ్మీర్ దర్గాహ్ వెళ్ళింది. ఆ తర్వాత మాధురీ గుప్తా అజ్మీర్లో చనిపోయారని వార్తలు వచ్చాయి. ఆమెకు కోవిడ్, డయాబెటిస్ మరియు అనేక ఇతర వ్యాధులు ఒకేసారి వచ్చాయి. ఆమె అంత్యక్రియలను స్థానిక ప్రజలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ వారు నిర్వహించారని జనాల ద్వారా తెలిసింది… ఆమె మరణానంతరం ఆమె కోసం ఎవరూ ఏడవలేదు, అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరు ముందుకు రాలేదు.

Admin

Recent Posts