హెల్త్ టిప్స్

పుచ్చ‌కాయ విత్త‌నాల‌తో ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజనాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

పైకి ఆకుప‌చ్చ‌గా ఉన్నా లోప‌లంతా చూడ చ‌క్క‌ని ఎరుపు రంగులో ఉండే గుజ్జుతో తింటానికి క‌మ్మ‌గా ఉండే పచ్చ‌కాయ‌లంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌వు చెప్పంది. వాటిని ప్ర‌తి ఒక్క‌రు ఇష్టంగా తింటారు. వేసవి కాలంలోనైతే చ‌ల్ల చ‌ల్ల‌ని పుచ్చ‌కాయ తింటే ఆ మ‌జాయే వేరేగా ఉంటుంది. అయితే ఎవ‌రైనా పుచ్చ‌కాయను ఏ విధంగా తింటారు? కాయ‌ను కోసి అందులో ఉండే ఎర్ర‌ని గుజ్జును తింటూ మ‌ధ్య‌లో నోట్లోకి వ‌చ్చే విత్త‌నాల‌ను ఊసేస్తుంటారు. కొంద‌రైతే పంటి కింద ఆ విత్త‌నాలు ప‌డితే దాంతో ఏదో అనారోగ్యం క‌లుగుతుందేమో, అవి మన శ‌రీరానికి మంచివి కావేమోనన్న భ్ర‌మ‌లో కంగారు ప‌డుతుంటారు. అయితే మీకు తెలుసా? పుచ్చ‌కాయ‌లో గుజ్జే కాదు, విత్త‌నాలు కూడా మ‌నకు ఎన్నో ర‌కాల పోష‌కాల‌ను అందిస్తాయని. అంతేకాదు అవి మ‌న‌కు క‌లిగే వివిధ అనారోగ్యాల‌ను కూడా దూరం చేస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పుచ్చ‌కాయ విత్త‌నాల్లో ఎన్నో ర‌కాల పోష‌క ప‌దార్థాలు ఉన్నాయి. వాటిలో ఉండే ఫైబ‌ర్ జీర్ణ సంబంధ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది. పేగులు, జీర్ణాశ‌యంల‌లో ఉండే పురుగులను నిర్మూలిస్తుంది. వాపులు, ప‌చ్చ కామెర్లు వంటివి రాకుండా చూస్తుంది. డై యురెటిక్ గుణాలు పుచ్చ‌కాయ విత్త‌నాల్లో పుష్క‌లంగా ఉన్నాయి. దీని వ‌ల్ల మూత్రాశయ సంబంధ ఇన్‌ఫెక్ష‌న్లు దూర‌మ‌వుతాయి. పుచ్చ‌కాయ విత్త‌నాల‌తో త‌యారు చేసిన టీని నిత్యం తాగుతుంటే కిడ్నీ స్టోన్స్ క‌రుగుతాయి. మూత్రం సాఫీగా వ‌స్తుంది. పుచ్చ‌కాయ విత్త‌నాల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా పుష్క‌లంగానే ఉన్నాయి. ర‌క్త నాళాల‌ను వెడ‌ల్పు చేసి ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు పర‌చ‌డంలో ఇవి ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి. హైప‌ర్ టెన్ష‌న్‌, యాంజినా పెక్టోరిస్‌, అథెరోస్లెరోసిస్ వంటి వ్యాధుల‌ను దూరం చేసే గుణాలు వీటిలో ఉన్నాయి.

many wonderful health benefits of watermelon seeds

జ్ఞాప‌క‌శ‌క్తిని మెరుగు ప‌ర‌చ‌డంలో, ఏకాగ్ర‌త‌ను పెంచ‌డంలో, గుండె ప‌నితీరును మెరుగు ప‌ర‌చ‌డంలో, కండ‌రాల క‌ద‌లిక‌ల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌డంలో పుచ్చ‌కాయ విత్త‌నాలు బాగా ప‌నిచేస్తాయి. ఇక ముందు మీరెప్పుడైనా పుచ్చ‌కాయ‌ను తింటే వాటిలోని విత్త‌నాల‌ను వృథాగా మాత్రం పారేయ‌కండి. వాటన్నింటినీ సేక‌రించి ఎండ బెట్టి మెత్త‌ని పొడిగా చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల మోతాదులో ఈ పొడిని తీసుకుని దాన్ని 2 లీట‌ర్ల నీటిలో 15 నిమిషాల పాటు మ‌ర‌గబెట్టండి. అనంత‌రం వ‌చ్చే ద్ర‌వాన్ని రెండు రోజుల పాటు నిరంత‌రాయంగా తాగండి. దాంతో వ‌చ్చే ఫ‌లితాల‌ను మీరే గ‌మ‌నిస్తారు. అలా రెండు రోజుల పాటు తాగిన త‌రువాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి మ‌ళ్లీ రెండు రోజుల పాటు తాగాలి. త‌ర‌చూ ఇలా తాగుతుంటే మీకుండే అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

Admin

Recent Posts