2022 Maruti Suzuki WagonR : ప్రముఖ కార్ల ఉత్పత్తిదారు మారుతి సుజుకి సరికొత్త మోడల్ వాగన్ఆర్ కారును లాంచ్ చేసింది. 2022 మోడల్‌లో ఈ కారును విడుదల చేసింది. ఇందులో డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు లేనప్పటికీ పలు ఫీచర్లలో మాత్రం మార్పులను చేశారు. ఇక ఇంజిన్ లో చేసిన మార్పుల ఆధారంగా ఈ కారు తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. అలాగే ఎక్కువ మైలేజీ ఇస్తుంది. ఈ మోడల్ కారు ఆటోమేటిక్, మాన్యువల్‌తోపాటు సీఎన్‌జీ మోడల్‌లోనూ లభిస్తోంది. 1.0, 1.2 లీటర్ ఇంజిన్ మోడల్స్‌లో ఈ కారు లభిస్తోంది.
కొత్త వాగన్ఆర్ మోడల్ కారులో రూ.12వేలను అదనంగా చెల్లిస్తే ప్రీమియం డ్యుయల్ టోన్ ట్రీట్‌మెంట్‌ను అందిస్తారు. కారులోపల 7 ఇంచుల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. స్మార్ట్ ప్లే స్టూడియో, 4 స్పీకర్లు, క్లౌడ్ ఆధారిత సేవలు, స్మార్ట్ ఫోన్ ఆధారిత నావిగేషన్ ఫీచర్లను ఈ కారులో అందిస్తున్నారు. అలాగే నిర్దిష్టమైన ప్రమాణాల ప్రకారం సేఫ్టీ ఫీచర్లు లభిస్తున్నాయి. ముందు రెండు సీట్లకు ఎయిర్ బ్యాగ్స్‌ను అందిస్తున్నారు. దీంతోపాటు ఈబీడీ, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్‌ను అందిస్తున్నారు.
వాగన్ ఆర్ 2022 మోడల్ లో డ్యుయల్ జెట్ డ్యుయల్ వీవీటీ ఇంజిన్ ఉంది. ఇది 1.0, 1.2 లీటర్ మోడల్స్ లో లభిస్తోంది. 67 బీహెచ్‌పీ, 90 బీహెచ్‌పీ కెపాసిటీలు ఉన్నాయి. జడ్ఎక్స్ఐ , జడ్ఎక్స్ఐ ప్లస్ మోడల్స్‌లో 1.2 లీటర్ల ఇంజిన్ లభిస్తుంది. 1.0 లీటర్ ఇంజిన్ మోడల్‌లో సీఎన్‌జీ ఆప్షన్‌ను అందిస్తున్నారు. ఈ మోడల్ ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ వేరియెంట్లలో లభిస్తోంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియెంట్లలో కారు అందుబాటులో ఉంది.
కొత్త మోడల్ వాగన్ఆర్ కారు 1.0 లీటర్ ఇంజిన్ సుమారుగా లీటర్‌కు 25 కిలోమీటర్ల మేర మైలేజీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. అలాగే 1.2 లీటర్ మోడల్ మాన్యువల్ అయితే లీటర్‌కు 23 కిలోమీటర్లు, ఆటోమేటిక్ అయితే లీటర్‌కు 24 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇక 1.0 లీటర్ సీఎన్‌జీ ఇంజిన్ అయితే లీటర్‌కు 34 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
2022 మారుతి సుజుకి వాగన్ఆర్ కారు మోడల్స్ ధరల వివరాలు (ఎక్స్ షోరూం) ఇలా ఉన్నాయి.
1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మోడల్స్ ధరలు..
WagonR LXI MT – రూ. 5,39,500
WagonR LXI Tour H3 MT – రూ.5,39,500
WagonR LXI S-CNG MT – రూ.6,34,500
WagonR LXI S-CNG TourH3 MT – రూ.6,34,500
WagonR VXI MT – రూ.5,86,000
WagonR VXI AGS – రూ.6,36,000
WagonR VXI S-CNG – రూ.6,81,000
1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మోడల్స్ ధరలు..
WagonR ZXI MT – రూ.5,99,600
WagonR ZXI AGS – రూ.6,49,600
WagonR ZXI+ MT – రూ.6,48,000
WagonR ZXI+ AGS – రూ.6,98,000
WagonR ZXI+ MT Dual Tone – రూ.6,60,000
WagonR ZXI+ AGS Dual Tone – రూ.7,10,000
2022 మారుతి సుజుకి వాగన్ఆర్ మోడల్ కార్లు మారుతి సుజుకి సబ్‌స్క్రైబ్ సర్వీస్ పద్ధతిలో కూడా లభిస్తున్నాయి. నెలకు రూ.12వేలు చెల్లించి వీటిని వాడుకోవచ్చు. రిజిస్ట్రేషన్, సర్వీస్, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటివన్నీ ఈ ఫీజులో కలిసే ఉన్నాయి.