Aishwarya Rajinikanth : ధ‌నుష్‌కు విడాకులు ఇచ్చిన త‌రువాత ఎట్ట‌కేల‌కు నోరు విప్పిన ఐశ్వ‌ర్యా ర‌జ‌నీకాంత్‌..!

Aishwarya Rajinikanth : సెల‌బ్రిటీలు ఈ మ‌ధ్య‌కాలంలో చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. మొన్నా మ‌ధ్య స‌మంత‌, నాగ‌చైత‌న్య‌.. త‌రువాత ఇప్పుడు ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌.. ఇలా సెల‌బ్రిటీ జంటల్లో విడాకులు కామ‌న్ అయిపోయాయి. ఈ క్ర‌మంలోనే ధ‌నుష్‌, ఐశ్వ‌ర్యలు తాము విడిపోతున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. 18 ఏళ్ల వివాహ బంధానికి స్వ‌స్తి చెబుతున్నామ‌ని తెలిపారు. దీంతో ఐశ్వ‌ర్య తండ్రి, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఆయ‌న వారిద్ద‌రినీ క‌లిపే ప్ర‌య‌త్నం చేశారు. కానీ వీలు కాలేదు.

Aishwarya Rajinikanth finally responded on her divorce with Dhanush
Aishwarya Rajinikanth

ఇక ధ‌నుష్‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన అనంత‌రం ఐశ్వ‌ర్య కోవిడ్ బారిన ప‌డి హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంది. ఈ క్ర‌మంలోనే ఆమె ప్ర‌స్తుతం కోలుకుంది. ఈ సంద‌ర్భంగా ఓ మీడియా సంస్థ‌తో ఆమె మాట్లాడుతూ.. విడాకుల త‌రువాత తాను అనుభ‌విస్తున్న స్థితి గురించి చెప్పుకొచ్చింది. జీవితంలో మ‌న‌కు అనేక సంఘ‌ట‌న‌లు ఎదుర‌వుతుంటాయి. అన్నింటినీ భ‌రిస్తూ ముందుకు సాగాలి. మ‌న‌కు ఏది రాసి పెట్టి ఉంటే అది జ‌రుగుతుంది. అందుకు ఎల్ల‌వేళ‌లా సిద్ధంగా ఉండాలి.. అని ఐశ్వ‌ర్య పేర్కొంది.

ప్రేమ అనేది కేవ‌లం ఒక్క‌రికే ప‌రిమితం కాద‌ని.. తాను త‌న కుటుంబ స‌భ్యుల‌ను ప్రేమిస్తాన‌ని.. తన తండ్రి, పిల్ల‌లు, త‌ల్లి.. ఇలా అంద‌రినీ ప్రేమిస్తాన‌ని.. క‌నుక ప్రేమ‌ను ఒక్క‌రికే ముడిపెట్ట‌డం సాధ్యం కాద‌ని.. అది మారుతుంద‌ని ఐశ్వ‌ర్య పేర్కొంది. కాగా ధ‌నుష్, ఐశ్వ‌ర్య‌లు 2004 లో వివాహం చేసుకున్నారు. వీరికి యాత్ర‌, లింగ అని ఇద్ద‌రు సంతానం.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ధ‌నుష్ ఇటీవ‌లే అత్రంగి రే.. అనే బాలీవుడ్ సినిమాలో న‌టించారు. అందులో ధ‌నుష్ పక్క‌న సారా అలీఖాన్ హీరోయిన్‌గా న‌టించింది. అలాగే బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఇందులో కీల‌క‌పాత్ర పోషించారు.

Editor

Recent Posts