Ananya Pandey : విజ‌య్ దేవ‌ర‌కొండ బ్యూటీ ప్రేమ‌లో ప‌డిందా.. ఆమె ప్రియుడు అత‌నేనా ?

Ananya Pandey : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌అనన్య పాండే. ఈ సినిమా త‌ర్వాత‌ పతి పత్ని ఔర్ వో లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అన‌న్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తోంది ఈ భామ. సోషల్ మీడియాలో అనన్య క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే అనన్యని ఇన్‌స్టాగ్రామ్‌ లో 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే ఆమె హ‌వా ఏ రేంజ్‌లో సాగుతుందో అర్ధం చేసుకోవ‌చ్చు.

Ananya Pandey  reportedly in love with an actor
Ananya Pandey

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అన‌న్య పాండే తాజాగా అభిమానుల‌తో ముచ్చ‌టించింది. అభిమానులతో తన రిలేషన్ షిప్ స్టేటస్, ఫేవరెట్ హీరో గురించి మాట్లాడింది. ఓ నెటిజన్ అనన్య తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అడిగినప్పుడు, ముందుగా ఆ ప్రశ్న నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ “నేను సంతోషంగా ఉన్నాను” అంటూ ఇన్ డైరెక్ట్ గా సమాధానం చెప్పింది. ఇక ఫేవ‌రేట్ ఎవ‌రు అంటే ఇషాన్ అని చెప్పింది. రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఇన్ డైరెక్ట్ గా సమాధానం ఇవ్వడం, ఫేవరెట్ హీరో ఇషాన్ అని చెప్పడంతో నెటిజన్లు వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు.

బోల్డ్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్న‌ అనన్య పాండే సోష‌ల్ మీడియాలో ఇస్తున్న ఫోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఒంపు సొంపులతో అనన్య పాండే హాట్ కేకులా కుర్రాళ్లని ఊరిస్తోంది. కిల్లింగ్ లుక్స్ తో అనన్య లేడీ బాస్ తరహాలో ఇస్తున్న ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. ఇటీవ‌ల గేహ్రియాన్ సినిమాతో ప‌ల‌క‌రించిన అన‌న్య పాండే త్వ‌ర‌లో విజ‌య్ తో క‌లిసి లైగ‌ర్ సినిమాతో ర‌చ్చ చేయ‌నుంది. ఈ సినిమాపై అంద‌రిలో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Sam

Recent Posts