ఆధ్యాత్మికం

Lord Shani : ఏలినాటి శని ప్రభావంతో బాధపడ్తున్నారా..? శని ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే ఇలా చేయండి..!

Lord Shani : శనిప్రభావ తీవ్రతను తగ్గించుకోవాలంటే.. విష్ణుసహస్రనామం, ఆదిత్య హృదయం, సుందరకాండ పారాయణం చేయాల్సిందేనని పండితులు చెబుతున్నారు. ప్రతి శనివారం శనిదేవునిని ఆరాధించడం, నవగ్రహాల్లో శనీశ్వరుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించ‌డం చేయాలి. పక్షులకు ఆహారం వేయడం, పరమేశ్వరుని పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ద్వారా శనీశ్వరుడు శుభఫలితాలను ఇస్తాడు.

యాచకులకు, వికలాంగులకు పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుముఖం పడుతుంది. శనీశ్వర ప్రభావం తగ్గాలంటే ఈశ్వరాధన, హనుమంతుడి ఆరాధన చేయాలి. ఏలినాటి శని ప్రభావం ఏడున్నర ఏళ్లు ఉంటుంది కాబట్టి, శని పాపగ్రహం కావున కష్టాలను ఇస్తాడు. క‌నుక ఈ గ్రహం రాశిలో ఉన్నప్పుడు ప్రాణభయం, ధనం లేకపోవడం, అథ‌మ స్థానానికి వెళ్ళిపోవడం వంటివి జరుగుతుంటాయి.

are you suffering from elinati shani then do like this

అయితే శని మన రాశిలో ప్రవేశిస్తే కొన్ని మంచి పనులు కూడా చేస్తాడు. వివాహం, ఇంటి నిర్మాణం, ఉద్యోగం లాంటివి ఇస్తాడు. కానీ వాటి వెనుక అధిక ఖర్చు వంటి ఇబ్బందులు సృష్టిస్తాడు. అందుకే ఇలాంటి కష్టాల నుంచి గట్టెక్కాలంటే శనివారం శనీశ్వర పూజ చేసి ఆయన్ని శాంతింపజేయాలి. నువ్వులనూనె, శంఖుపువ్వులను సమర్పించి ప్రార్థించాలి. ఇలా చేస్తే శని గ్రహ ప్రభావం తగ్గుతుంది. ఈతి బాధలు సైతం తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts