చిట్కాలు

Snoring Home Remedies : గుర‌క స‌మ‌స్య‌ను త‌గ్గించుకోండిలా.. ఈ 5 చిట్కాల‌ను పాటించండి..!

Snoring Home Remedies : మ‌న‌లో చాలా మంది గుర‌క స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. గుర‌క వ‌ల్ల వారితో పాటు వారి ప‌క్క‌న ప‌డుకునే వారికి కూడా ఇబ్బంది క‌లుగుతుంది. గుర‌క కార‌ణంగా ప్ర‌శాంత‌మైన నిద్ర‌ను దూరం చేసుకుంటారు. గుర‌క పెట్ట‌డం వ‌ల్ల వారి ప‌క్క‌న ప‌డుకునే వారికి కొన్నిసార్లు నిద్ర ప‌ట్ట‌డం కూడా క‌ష్టంగా మారుతుంది. శ్వాస తీసుకోవ‌డంలో అడ్డంకులు ఏర్ప‌డ‌డం వ‌ల్ల ఎక్కువ‌గా గుర‌క వ‌స్తుంది. గుర‌క వ‌ల్ల వారి జీవిత భాగ‌స్వామికి ఇబ్బంది క‌లుగుతుంద‌ని బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మీతో పాటు మీ జీవిత భాగ‌స్వామి కూడా ప్రశాంతంగా నిద్రించ‌వ‌చ్చు. గుర‌క స‌మ‌స్య‌తో ఎక్కువ‌గా బాధ‌ప‌డే వారు ఇయ‌ర్ ప్ల‌గ్ ల‌ను వాడ‌డం మంచిది. గుర‌క శబ్దాన్ని త‌గ్గించ‌డంలో ఇవి ప్ర‌భావ‌వంతంగా ప‌ని చేస్తాయి. వీటిని వాడ‌డం వ‌ల్ల ప్ర‌శాంత‌మైన నిద్ర మీ సొంతం అవుతుంది.

నిద్ర‌కోసం రూపొందించ‌బ‌డిన మృదువైన‌, సౌక‌ర్య‌వంత‌మైన ఇయ‌ర్ ప్ల‌గ్ ల‌ను కొనుగోలు చేసి వాటిని ధ‌రించి నిద్ర పోవ‌డం వ‌ల్ల గుర‌క శ‌బ్దం త‌క్కువ‌గా వ‌స్తుంది. అలాగే గుర‌క స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు వైట్ నాయిస్ మెషీన్ లేదా యాప్ ల‌ను వాడ‌డం మంచిది. ఇవి గుర‌క శ‌బ్దానికి బదులుగా మ‌నం నిద్ర‌పోవ‌డానికి అనువుగా ఉండే ఇత‌ర శ‌బ్దాల‌ను సృష్టించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. మీకు ఏది బాగా ప‌ని చేస్తుందో తెలుసుకోవ‌డానికి గానూ స‌ముద్ర‌పు అల‌లు, వ‌ర్ష‌పాతం, ప‌క్షుల అరుపులు ఇలా వివిధ శ‌బ్దాల‌తో ప్ర‌యోగాలు చేయ‌డం మంచిది. అలాగే మీరు ప‌డుకునే విధానాన్ని కూడా మార్చాలి. మీకు గుర‌క ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటే మీ జీవిత భాగ‌స్వామి వైపు తిరిగి ప‌డుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గుర‌క త‌గ్గుతుంది. గాలి ప్ర‌వాహాం కూడా మెరుగుప‌డుతుంది.

wonderful home remedies for snoring

అలాగే త‌ల‌కింద అద‌నంగా దిండ్ల‌ను ఉంచుకోవ‌డం వ‌ల్ల శ్వాస తీసుకోవ‌డం సుల‌భ‌త‌రం అవుతుంది. అలాగే ప‌డుకునే ముందు ప్ర‌శాంతంగా ఉండేలా చూసుకోవాలి. నిద్ర‌కు ముందు కెఫీన్, ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవ‌డం త‌గ్గించాలి. ప‌డుకునే గ‌ది చ‌ల్ల‌గా, చీక‌టిగా ఉండేలా చూసుకోవాలి. ఇది గుర‌క‌ను త‌గ్గించ‌డంతో పాటు మీకు మ‌రియు మీ జీవిత భాగ‌స్వామికి ప్ర‌శాంత‌మైన నిద్ర‌ను అందించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అదేవిధంగా గురక స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ధూమ‌పానానికి, మద్య‌పానానికి దూరంగా ఉండాలి. శ‌రీర బ‌రువు అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న శైలిని పాటించాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఇలా మ‌న జీవ‌న శైలిలో త‌గిన మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల గుర‌క స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

Admin

Recent Posts