వినోదం

Allu Arjun : అర్జున్ రెడ్డి లాంటి హిట్ సినిమాను వ‌దులుకున్న అల్లు అర్జున్‌.. కార‌ణం ఏంటో తెలుసా..?

Allu Arjun :విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా చేసి అప్ప‌ట్లో ఘ‌న విజ‌యం సాధించాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వ‌చ్చిన అర్జున్ రెడ్డి అన్ని సెంటర్స్ లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ ప్రేక్షుకులను కట్టిపడేసింది. అయితే ఈ కథ ముందుగా కొంతమంది హీరోలకు వద్దకు వెళ్లిందని, వారు తిరస్కరించారని ఫిల్మ్ నగర్లో అప్ప‌ట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అర్జున్ రెడ్డి పాత్రకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే సరిపోతాడ‌ని డైరక్టర్ సందీప్ రెడ్డి అనుకున్నార‌ట. అందుకే ముందుగా ఆయనకు కథ వినిపించారని తెలిసింది.

అల్లు అర్జున్ కి కథ నచ్చినప్పటికీ.. కమర్షియల్ హీరోగా స్థిరపడుతున్న సమయంలో ప్రేమ కథలు చేయనని చెప్పినట్లు టాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాదు యువ హీరో శర్వానంద్ ని కూడా హీరోగా చేయమని డైరక్టర్ అడిగార‌ట‌. ఆయన కూడా నో చెప్పార‌ట. వీరిద్దరూ నో చెప్పడంతో ఈ కథ విజయ్ చేతికి చిక్కింది. అతని ఖాతాలో మరో హిట్ చేరింది.

allu arjun missed to do arjun reddy movie

ఇక అర్జున్ రెడ్డి మూవీని చేయ‌కున్న‌ప్ప‌టికీ అల్లు అర్జున్ మాత్రం ప్ర‌స్తుతం పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆయ‌న న‌టించిన పుష్ప మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. ఈ క్ర‌మంలోనే పుష్ప 2 సైతం ఆల్ టైమ్ రికార్డుల‌ను నమోదు చేస్తోంది.

Admin

Recent Posts